Homeఎంటర్టైన్మెంట్Cooku with Jathi Ratnalu 2 : 'కుకూ విత్ జాతి రత్నాలు 2' టైటిల్...

Cooku with Jathi Ratnalu 2 : ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ టైటిల్ విన్నర్ , రన్నర్ వీళ్ళే.. టాప్ 5 కి పరితమైన టాప్ కంటెస్టెంట్..

Cooku with Jathi Ratnalu 2 : స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఎంటర్టైన్మెంట్ షోస్ లలో ఒకటి ‘కుకూ విత్ జాతిరత్నాలు 2’. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఆరంభం ఎపిసోడ్ నుండే అద్భుతమైన రేటింగ్స్ నమోదు అవుతూ వచ్చాయి. రీసెంట్ గానే వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో సుమిత్ రాయ్ గత వారం ఎలిమినేట్ అవ్వగా , ఈ వారం మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ శ్రవణ్ ఎలిమినేట్ అవ్వనున్నారు. ఇక ఆ తర్వాత వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిక , పునర్నవి కూడా ఎలిమినేట్ అయ్యారు అట. ఇకపోతే నిన్ననే ఈ సీజన్ కి సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యిందట. విన్నర్ ఎవరో , రన్నర్ ఎవరో తెలిసిపోయారు. వాటి వివరాలతో పాటు , టాప్ 6 స్థానం లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు , టాప్ 5 లో ఎవరెవరు ఏ స్థానం లో నిలిచారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

టాప్ 6 స్థానం లో పల్లవి గౌడ ఎలిమినేట్ అయ్యారట. ఈమె ఈ షో లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు. కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని అనుకున్నారు కానీ , దురదృష్టం కొద్దీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక టాప్ 5 స్థానం లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే , రాకేష్. ఇతను కూడా షో లో టాప్ కంటెస్టెంట్, కచ్చితంగా టాప్ 3 లో ఉంటారని అంతా అనుకున్నారు కానీ కుదర్లేదు. ఇక ఆ తర్వాత టాప్ 4 స్థానం లో ఆశికా ఎలిమినేట్ అవ్వగా , టాప్ 3 స్థానం లో నిఖిల్ విజయేంద్ర సింహా ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. ఇక టాప్ 2 స్థానాల్లో అందరూ ఊహించినట్టుగానే తనూజ , డిమోన్ పవన్ నిలిచారు.

తనూజా టైటిల్ విన్నర్ గా నిలబడగా , డిమోన్ పవన్ రన్నర్ గా నిలిచారు. డిమోన్ పవన్ మొదటి నుండి ఈ షో లో అద్భుతమైన వంటకాలతో జడ్జీల మెప్పు పొందారు. మధ్యలో కొన్ని వారాలు డౌన్ అయ్యి , కుక్ ఆఫ్ రౌండ్ వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది కానీ , ఆయన మళ్లీ కం బ్యాక్ ఇచ్చి రన్నర్ గా నిలవడం గొప్ప విషయమే. ఇక తనూజ గత సీజన్ లో టాప్ 6 స్థానం లో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె , ఎలా అయినా టైటిల్ గెలవాలి అనే కసితో పని చేసి, మొత్తానికి అనుకున్నది అయితే సాధించింది. ఇది ఆమె అభిమానులకు గూస్ బంప్స్ రప్పించే వార్త అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version