ఎన్టీఆర్ స్టార్ డమ్ పుణ్యమా అని బిగ్ బాస్ అనే షో తెలుగు వాకిట్లో అమ్మలక్కల ముచ్చట్లులో ఒక భాగమైపోయింది. దాంతో బిగ్ బాస్ 4 మొదలు కాకుండానే ఎక్కడా లేని హడావుడి కనిపిస్తోంది. షో పై తిట్ల వర్షం ఒకవైపు, ప్రశంసల జల్లు మరోవైపు. ఈ లోపు అనుకున్నది అంతా అయ్యింది. షో మొదలు కాకముందే.. షో పై రచ్చ మొదలైంది. ఏది మొదలైన ఈ షోకి అదంతా ఫ్రీ పబ్లిసిటీనే. ఏమైనా ఈ విద్యార్థి సంఘాలు.. కుల సంఘాలు.. మహిళా సంఘాలు ఇలా ఏ సంఘాలైనా సరే.. ఇలాంటి సంఘాలు తెచ్చేంత ఫ్రీ పబ్లిసిటీ ఇంకెవరూ తేలేరు. ఉన్న బురద తక్కువ అయితే.. ఆ బురదలో దిగి మొత్తానికి అందరికీ బురద పూసేదాకా మన సంఘాలు ఊరుకోవు కదా. నిజానికి గత మూడు సీజన్స్ లో బిగ్ బాస్ షోలో జరిగిన బాగోతాలు కంటే కూడా.. మన వాళ్ళు షో పై చేసే పంచాయితీనే ఎక్కువ ఉంటుంది
Also Read: మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !
కాగా తాజాగా మన మానవ హక్కుల సంఘాలు కూడా యాడ్ అయి.. షోకి కావాల్సినంత పబ్లిసిటీ తెస్తున్నాయి. ఆ మాటకొస్తే.. ఈ రియాలిటీ షో అనేది తెలుగు రాష్ట్రాల్లో పాశ్చాత్య ధోరణి పెట్రేగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది అంటూ ఎప్పటినుండో సాంప్రదాయవాదులు విమర్శిస్తూనే ఉన్నారనుకోండి. గత మూడు సీజన్లలోనూ ఈ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా అలాగే కొనసాగింది. తాజాగా విద్యార్థి సంఘం నాయకులు.. అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళాధ్యక్షులు బరిలో దిగి బిగ్ బాస్ షో పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. జనాలకు తప్పుడు సందేశం ఇచ్చే బిగ్ బాస్ షోని నిషేధించాలని మరోసారి రచ్చ షురూ చేశారు.
Also Read: ఆదిపురుష్ మొదలయ్యేది ఎప్పుడంటే..?
బిగ్ బాస్ షో గురించి తెలియని మారుమూల గ్రామాలకు కూడా షో గురించి తెలియటానికి కాకపోతే.. ఈ రచ్చ వల్ల మరొక ఉపయోగం లేదని అందరికీ తెలుసు, ఈ సంఘాల నాయకులకు తప్ప. నిజానికి వీరి డిమాండ్ లో నిజాయితీ ఉంది. యూత్ ను తప్పుదారి పట్టించే ఇలాంటి షోలను ఆపేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి షోలు ఇలానే కొనసాగితే యువత మీద ప్రభావం చూపిస్తాయి. అయినా ప్రభావితం అయ్యే యువత ఉన్నప్పుడు వాళ్ళు ఇంకో రకంగా ప్రభావితం అవుతారు. సమాజంలో మార్పు రావాలంటే.. టీవీ షోల మీద పడితే ఏం మార్పు వస్తోంది. బిగ్ బాస్ షో లాంటివి మేం సహించం అంటూ మహిళామండళ్లు వార్నింగులు ఇచ్చినా.. ఏం లాభం? అసలు ఇలాంటివన్నీ మ్యానేజ్ చేయడంలో బిగ్ బాస్ నిర్వాహకులు సిద్ధహస్తులు అనేది ఇప్పటికే రుజువు అయిందయ్యే. వివాదంతో ప్రచారం చేసుకోవడం వీళ్లకో హ్యాబిట్.. మన సంఘాలన్నీ వీటిని అర్ధం చేసుకుంటే మంచింది.