Bigg Boss 7 Telugu: దొంగతనాలు, ఫౌల్ గేమ్స్ నీకు అర్హత లేదు… అమర్ బండారం బయటపెట్టిన అర్జున్!

అర్జున్ తనకు 10 నిమిషాలు ఇచ్చుకుంటాను అంటూ 10 బోర్డు మెడలో వేసుకున్నాడు. ఓవరాల్ 60 నిమిషాల్లో 10 నిముషాలు కనబడాలని అనుకుంటున్నట్లు అర్జున్ చెప్పాడు. ఇక శివాజీ, అమర్ కి కేవలం మూడు నిమిషాలు ఇచ్చాడు.

Written By: NARESH, Updated On : December 15, 2023 9:29 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వారి మధ్య ఓ కొత్త చర్చకు తెర లేపారు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ‘ మీ 14 వారాల జర్నీ తర్వాత మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఒక ఎపిసోడ్లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులు అని భావిస్తున్నారు చెప్పండి అంటూ బిగ్ బాస్ అడిగారు. ఒక్కొక్కరు మీరు అనుకున్న టైం కార్డు ఇచ్చి సరైన కారణాలు చెప్పమని బిగ్ బాస్ చెప్పారు.

అయితే ముందుగా అర్జున్ తనకు 10 నిమిషాలు ఇచ్చుకుంటాను అంటూ 10 బోర్డు మెడలో వేసుకున్నాడు. ఓవరాల్ 60 నిమిషాల్లో 10 నిముషాలు కనబడాలని అనుకుంటున్నట్లు అర్జున్ చెప్పాడు. ఇక శివాజీ, అమర్ కి కేవలం మూడు నిమిషాలు ఇచ్చాడు. దీంతో మరీ మూడు నిముషాలు టైం నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా అంటూ అమర్ చెప్పాడు. తర్వాత శివాజీ మెడలో 20 నిమిషాల బోర్డు వేసింది ప్రియాంక.

ఇక అర్జున్ కి అమర్ మూడు నిమిషాల టైం కార్డు ఇచ్చాడు. ఇక శివాజీ, ప్రశాంత్ ఒకరికి ఒకరు 20 నిమిషాల బోర్డు ఇచ్చుకున్నారు. ప్రియాంక మెడలో 7 నిమిషాలు బోర్డు వేసాడు ప్రశాంత్. తర్వాత శివాజీ 10 నిమిషాలు ప్రియాంకకి ఇచ్చాడు. ఇక యావర్ కూడా 3 నిమిషాల బోర్డు అమర్ కి ఇచ్చాడు. దీంతో నేను కనిపడేది 3 నిమిషాలేనా అంటూ అని అమర్ అన్నాడు.

ఇక చివర్లో అర్జున్ .. అమర్ కి 20 నిమిషాలు బోర్డు ఇచ్చాడు. వెంటనే శివాజీ ఎందుకురా నీకు 20 నిమిషాలు నాకు అర్ధం కాలేదు అంటూ శివాజీ కౌంటర్ వేసాడు. దీంతో అర్జున్ ‘ ఆడంటే దొంగతనాలు, ఫౌల్ గేములు అంటూ మొదలు పెట్టాడు .. ఏయ్ ఆపేయ్ గొప్పలు వద్దు అంటూ అమర్ అన్నాడు. ఏయ్ .. చెప్పనీ అయి గొప్పలేం కాదు నువ్వు వెధవ్వని చెబుతున్నాడు అంటూ శివాజీ పంచ్ వేసాడు.