Bigg Boss Telugu 8: హద్దులు దాటుతున్న గంగవ్వ..వయస్సు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు..ఆ నోటికి అదుపు లేదు!

ప్రియాంక జైన్ లాంటి కంటెస్టెంట్స్ పిలిచి ఉండుంటే బోలెడంత కంటెంట్ వచ్చేది కదా అని విశ్లేషకులు అభిప్రాయం. గంగవ్వ పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎపిసోడ్స్ లో ఈమె అస్సాం ట్రైన్ ఎక్కడం గ్యారంటీ అని చెప్పొచ్చు.

Written By: NARESH, Updated On : October 26, 2024 9:53 am

Gangavva

Follow us on

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో పైసా ఉపయోగం లేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది గంగవ్వ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె స్థానం లో మరో యంగ్ కంటెస్టెంట్ కి అవకాశం ఇచ్చి ఉండుంటే గేమ్ వేరే లెవెల్ లో ఉండేది కదా అని చూసే ఆడియన్స్ అందరికీ అనిపించింది. పైగా ఆమె కుదురుగా కూడా ఉండడం లేదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటుంది. సీజన్ 4 లో ఈమె ఇలాంటి యాంగిల్ చూపించలేదు. కానీ బయట ఆమెకు బాగా ఫాలోయింగ్ ఉంది, ఓట్లు పడుతున్నాయి అనే అహంకారం ఈ సీజన్ లో బాగా చూపించేస్తుంది గంగవ్వ. ముఖ్యంగా మొన్న గౌతమ్ విషయం లో ఈమె మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి.

గౌతమ్ లివింగ్ రూమ్ లో నడుచుకొని వెళ్తున్నప్పుడు హరితేజ ఎక్కడికి అని అడుగుతుంది. గౌతమ్ సరదాగా సమాధానం చెప్తూ ‘కూకట్ పల్లి’ అని అంటాడు. అప్పుడు గంగవ్వ మొన్ననే పోవాల్సిందిగా నువ్వు, ఆ మణికంఠ వెళ్లడం వల్ల బ్రతికిపోయావు అని అంటుంది. పక్కనే హరితేజ పాపం అలా నాకు అవ్వ, బాధపడుతాడు అని అనగా, ‘బాధపడితే ఎవడికి కావాలి..అది నిజమే కదా’ అని అంటుంది. అలాగే క్విజ్ టాస్క్ జరుగుతున్నప్పుడు నిన్న ప్రేరణ కి తెలుగు లో ఉండడం వల్ల ఒక ప్రశ్న అర్థం కాదు. అది టేస్టీ తేజా వివరించే ప్రయత్నం చేయగా, గంగవ్వ అతని వద్దకు వచ్చి నాన్ స్టాప్ గా కొడుతుంది. ఇది అన్యాయం కదూ..?, ఒక నాన్నమ్మ స్థానం లో నిల్చొని కొట్టింది అని కొంతమంది అనుకోవచ్చు, కానీ టేస్టీ తేజ ని అతని అమ్మానాన్నలే కొట్టి ఉండరేమో, అలాంటిది కోట్లాది మంది ప్రేక్షకులు చూసే ఒక నేషనల్ రియాలిటీ షోలో కొడితే అతనికి ఎలా ఉంటుంది?, ప్రతీ విషయాన్నీ తేలికగా, కామెడీ గా తీసుకునే టేస్టీ తేజ, గంగవ్వ అలా కొట్టడం వల్ల కాస్త ఫీల్ అయ్యినట్టుగా ఆయన ముఖం చూస్తే అర్థమైంది.

ఇలా కంటెస్టెంట్స్ మీద నోరు పారేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం, టాస్కులు ఆడలేకపోవడం, ఇలా ఒక్కటా రెండా బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు ఏ మాత్రం అర్హత లేని కంటెస్టెంట్ గా ఈమెని చూసినప్పుడల్లా ఆడియన్స్ కి అనిపిస్తుంది. 8 మంది వైల్డ్ కార్డ్స్ గా లోపలకు పంపారు, ఆ 8వ కంటెస్టెంట్ గా గంగవ్వ ని కాకుండా శేఖర్ బాషా తో రీ ఎంట్రీ ఇప్పించి ఉండుంటే బాగుండేది. శేఖర్ బాషా కాకపోయినా గత సీజన్ లో ఉండే యావర్, ప్రియాంక జైన్ లాంటి కంటెస్టెంట్స్ పిలిచి ఉండుంటే బోలెడంత కంటెంట్ వచ్చేది కదా అని విశ్లేషకులు అభిప్రాయం. గంగవ్వ పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎపిసోడ్స్ లో ఈమె అస్సాం ట్రైన్ ఎక్కడం గ్యారంటీ అని చెప్పొచ్చు.