Bigg Boss Telugu 8 : పృథ్వీ తో పూర్తిగా రిలేషన్ కట్ చేసుకున్న విష్ణు ప్రియ..వచ్చే వారం నుండి అయినా గేమ్ ఆడుతుందా?

మెగా చీఫ్ గా విష్ణు ప్రియ కి నామినేషన్స్ నుండి ఒకరిని సేవ్ చేసే పవర్ ఉంటుంది. ఆ పవర్ ని పృథ్వీ కోసం ఉపయోగిస్తుందా, లేదా తన క్లాన్ లో వేరే కంటెస్టెంట్ కోసం ఉపయోగిస్తుంది అనేది చూడాలి.

Written By: Vicky, Updated On : October 26, 2024 9:45 am
Follow us on

ఈ సీజన్ ప్రారంభం లో జనాలకు చూడగానే టాప్ అని అనిపించిన కంటెస్టెంట్స్ లో ఒకరు విష్ణు ప్రియ. కానీ పైన పటారం, లోన లొటారం అని ఆమె ఆడే ఆట తీరుని చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థం అయ్యింది. బిగ్ బాస్ కి వచ్చింది డబ్బు కోసమో, టైటిల్ కోసమో కాదు, పృథ్వీ కోసమే అన్నట్టుగా ఆమె వ్యవరిస్తుంది. ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ ఎదో ఒక టాస్క్ ని కసిగా ఆడి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ విష్ణు ప్రియ మాత్రం ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా ఇప్పటి వరకు ఆడలేదు. అయినప్పటికీ కూడా ఆమెకి ఓట్లు పడుతున్నాయి, ప్రతీ వారం సేవ్ అవుతూనే ఉంది, టాప్ 5 వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ వారం ఎలాంటి కష్టం చేయకుండా ఆమె హౌస్ కి మెగా చీఫ్ కూడా అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తి అయ్యాక పృథ్వీ విష్ణు ప్రియ ని కూర్చోబెట్టి నీకు నా మీద ఫీలింగ్స్ ఉంటే ఇప్పుడే కట్ చేసుకో, నాకు ఇలాంటి వాటి మీద ఆసక్తి లేదు అని అంటాడు. విష్ణు ప్రియ అందుకు హర్ట్ అవుతుంది. ఇకనైనా పృథ్వీ కి దూరంగా ఉంటుందేమో తన గేమ్ ని ఇప్పటి నుండి అయినా మొదలు పెడుతుందేమో అని ఆమె అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు, పృథ్వీ ‘ఛీ పో అవతలకి’ అన్నా కూడా అతని వెంట తిరుగుతూ, అతనికి సేవలు చేసుకుంటూ గడిపేస్తుంది. ఇది చూసేవాళ్లకు చాలా చిరాకుగా అనిపించింది. నిన్న కూడా వీళ్లిద్దరి మధ్య దీనిపై చర్చ నడిచింది. ముందుగా విష్ణు ప్రియ పృథ్వీ వద్దకు వచ్చి ‘నువ్వు నన్ను హర్ట్ చేయలేదని ఒట్టేసి చెప్పు’ అని అంటుంది. అప్పుడు పృథ్వీ ఒట్టేసి నేనేమి నిన్ను హర్ట్ చేయలేదు అని అంటాడు. ఇక ఆ తర్వాత విష్ణు ‘ఇందాక మాట్లాడడానికి పిలిచినప్పుడు నువ్వెందుకు రాలేదు?’ అని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ఇందాక బిజీ గా ఉన్నాను, అందుకే రాలేదు’ అని అంటాడు. ‘నువ్వు నాతో ఇక నుండి ఇలాగే మాట్లాడుతావా?, సీజన్ మొత్తం?’ అని అడుగుతుంది.

దానికి పృథ్వీ అవును అని సమాధానం చెప్తాడు. సరే ఇక నుండి నిన్న డిస్టర్బ్ చేయను, ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు అని అంటుంది. దానికి పృథ్వీ ఓకే పర్వాలేదు అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. మొత్తానికి విష్ణు ప్రియ కూడా బ్రేకప్ చెప్పేసింది. కానీ ఆమె తన మాట మీద ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఈ సోమవారం కచ్చితంగా పృథ్వీ నామినేషన్స్ లోకి వస్తాడు. మెగా చీఫ్ గా విష్ణు ప్రియ కి నామినేషన్స్ నుండి ఒకరిని సేవ్ చేసే పవర్ ఉంటుంది. ఆ పవర్ ని పృథ్వీ కోసం ఉపయోగిస్తుందా, లేదా తన క్లాన్ లో వేరే కంటెస్టెంట్ కోసం ఉపయోగిస్తుంది అనేది చూడాలి.