https://oktelugu.com/

Sarath Babu Health: శరత్ బాబు ఆరోగ్యం పై అయోమయం… చనిపోయారంటూ పుకార్లు!

ఈ ప్రకటనలపై శరత్ బాబు కుటుంబ సభ్యులు స్పందించారు. శరత్ బాబు కన్నుమూశారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆయన కోలుకుంటున్నారు. ఐసీయూ నుండి రూమ్ కి షిఫ్ట్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 4, 2023 / 08:03 AM IST
    Follow us on

    Sarath Babu Health: సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఆయన కండిషన్ విషమంగా మారినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనను కాపాడేందుకు వైద్య బృందం శ్రమిస్తున్నారని చెప్పారట. అయితే శరత్ బాబు కన్నుమూశారని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు ఆయన మరణించినట్లు ధృవీకరిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు.

    ఈ ప్రకటనలపై శరత్ బాబు కుటుంబ సభ్యులు స్పందించారు. శరత్ బాబు కన్నుమూశారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆయన కోలుకుంటున్నారు. ఐసీయూ నుండి రూమ్ కి షిఫ్ట్ చేశారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దంటూ… ఫ్యామిలీ మెంబర్స్ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒకింత అయోమయం నెలకొంది. వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారని వార్తలు వస్తుండగా, శరత్ బాబు కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

    అభిమానులు ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు నటనపై మక్కువ పెంచుకున్నారు. మద్రాస్ వెళ్లి నటుడిగా ప్రయత్నాలు చేశారు. చక్కని రూపం కలిగిన శరత్ బాబు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించారు. అయితే స్టార్ హీరో కాలేకపోయారు.

    శరత్ బాబు వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. నటి రమాప్రభను ఆయన వివాహం చేసుకున్నారు. అనంతరం విడిపోయారు. రమాప్రభ శరత్ బాబు మీద దారుణ ఆరోపణలు చేశారు. కేవలం అవసరాలు తీర్చుకోవడానికి, కెరీర్ కోసం నాకు దగ్గరయ్యాడు. 14 ఏళ్ల కాపురంలో నటిస్తూనే బ్రతికాడని, నా వద్ద ఉన్నవన్నీ దోచుకున్నాడని ఆమె విమర్శించారు. నేను సంపాదించిందే ఆమెకు ఇచ్చానంటూ శరత్ బాబు అంటుంటారు. 1990లో స్నేహ నంబియార్ అనే మరో మహిళను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఆయన విడిపోయారు.