TANA : తానా మహాసభలకు రావాలని ప్రముఖులకు ఆహ్వానం

ప్రతి ఏటా ఉత్తర అమెరికా సంఘం (తానా) మహాసభలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను పిలిచి ఆడంబరంగా జరుపుతుంటారు.

Written By: NARESH, Updated On : May 3, 2023 10:36 pm
Follow us on

TANA : ప్రతి సారి తెలుగు వారు వేడుకగా నిర్వహించే సభలు దిగ్విజయంగా జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి తదితరులను ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీంతో తానా మహాసభల నిర్వహణ జులై 4-6 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తానా మహాసభల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ విద్యావేత్త, విజ్ణాన్ విద్యా సంస్థల అధినేత లావు సత్తయ్యను ఆహ్వానించారు. దీంతో మహాసభలను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రముఖులైన వారిని రావాలని కోరుతున్నారు. దీనికి అందరు సహకరించాలని అంటున్నారు.

ప్రతి ఏటా ఉత్తర అమెరికా సంఘం (తానా) మహాసభలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను పిలిచి ఆడంబరంగా జరుపుతుంటారు. ఇక్కడ నుంచి వెళ్లిన వారందరిని సమీకరించి జరిపే సభలు బ్రహ్మాండంగా ఉంటాయి. వాటిలో పాల్గొనేందుకు చాలా మంది వెళ్తుంటారు. ఈ క్రమంలో తానా సభల విజయవంతానికి పాటుపడుతున్నారు.

తానా మహాసభల నేపథ్యంలో పాల్గొనేందుకు పలువురు ముఖ్యులను పిలుస్తున్నారు. మహాసభల వేడుక ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు. వాషింగ్టన్ నగరంలో ఈ వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు. అతిథులను ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తానా మహాసభల వేళ అందరు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించనున్నారు.