https://oktelugu.com/

Beast Vs KGF 2: తమిళనాడు లో బీస్ట్ కలెక్షన్స్ ని దాటేసిన KGF చాప్టర్ 2.. విజయ్ కి ఇది ఘోరమైన అవమానం

Beast Vs KGF 2: ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదల అయినా KGF చాప్టర్ 2 సినిమా ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రతి భాషలలోను రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ అక్కడి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ సినిమా..బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం మన అందరికి తెలిసిందే..అక్కడ మాత్రమే కాకుండా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 10:38 AM IST
    Follow us on

    Beast Vs KGF 2: ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదల అయినా KGF చాప్టర్ 2 సినిమా ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రతి భాషలలోను రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ అక్కడి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ సినిమా..బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం మన అందరికి తెలిసిందే..అక్కడ మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఇక్కడి స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ రేంజ్ లో వసూళ్లను రాబట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..ఇక తమిళనాడు లో అయితే ఈ సినిమాకి దెబ్బకి అక్కడి స్టార్ హీరో విజయ్ సినిమా కూడా చతికిలపడింది అంటే ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇప్పుడు తమిళనాడు లో ఈ సినిమా మరో సరికొత్త రికార్డుని మరి కొద్దీ రోజుల్లో నెలకొల్పబోతుంది.

    Yash, Vijay

    అదేమిటి అంటే తమిళనాడు స్టేట్ లో ఇప్పటి వరుకు అజిత్ , విజయ్ మరియు సూపర్ స్టార్ రజిని కాంత్ వంటి హీరోలు మినహా ఇప్పటీకి వరుకు 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేఇస్నా హీరోనే లేడు..ఒక్క బాహుబలి 2 సినిమా మినహా మరో హీరో ఇక్కడ 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టినా దాఖలాలు లేవు..కానీ KGF చాప్టర్ 2 మాత్రం అతి తేలికగా తమిళనాడు లో 100 క్తోల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోకుండి..రెండు వారాలకు గాను ఇప్పటి వరుకు ఈ సినిమా ఇక్కడ 75 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ సినిమాకి పోటీగా వచ్చిన విజయ్ బీస్ట్ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని తమిళనాడు స్టేట్ నుండి వసూలు చేసింది..కానీ తమిళ్ లో స్టార్ హీరో కాబట్టి వచ్చిన ఈ వసూళ్లు సగానికి 90 శాతం కి పైగా ఓపెనింగ్స్ నుండి వచ్చినవే.

    Also Read: Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !

    కానీ KGF చాప్టర్ 2 కి ఓపెనింగ్స్ లో ఇక్కడ బీస్ట్ లో సగం లేకపోయినప్పటికీ వీక్ డేస్ లో రోజు వారి కలెక్షన్స్ లో విజయ్ బీస్ట్ ని భారీ మార్జిన్ తో వసూలు చేస్తూ కోలీవుడ్ వర్గాలను షాక్ కి గురి అయ్యేలా చేస్తోంది.ఇక్కడ బీస్ట్ మూవీ రన్ దాదాపుగా క్లోజ్ అయ్యిపోయినట్టే..కానీ KGF చాప్టర్ 2 మాత్రం మరో రెండు వారల పాటు సాలిడ్ రన్ వచ్చే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అదే కనుక జరిగితే ఈ సినిమా బీస్ట్ మూవీ ఫుల్ రన్ ని భారీ మార్జిన్ తో దాటబోతుంది అని చెప్పొచ్చు..ఒక్క రోజు గాప్ లో విడుదల అయినా రెండు సినిమాలలో బీస్ట్ మేనియా ముందు KGF నిలబడలేదు అని అందరూ అనుకున్నారు..కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ KGF మేనియా ముందే బీస్ట్ నిలబడలేకపోవడం అందరిని షాక్ కి గురి చేసింది..రాబొయ్యే రోజుల్లో వరుసగా నాలుగు సెలవు దినాలు కూడా ఉండడం తో ఈ సినిమా వసూళ్లు ఊహించినదానికంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రేడ్ వర్గాల అంచనా.

    Also Read: KGF-3 Story: కేజీఎఫ్-2ను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందా? వైరల్ పిక్..!

    Recommended Videos:

    Tags