https://oktelugu.com/

Bigg Boss Non Stop Shree Rapaka: ముమైత్ ఖాన్ యాక్షన్.. శ్రీరాపాక రియాక్షన్

Bigg Boss Non Stop Shree Rapaka: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో కూడా రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు పెరిగిపోతున్నాయి. బిగ్ బాస్ అంటేనే గొడవలకు పుట్టినిల్లు, ప్రేమలకు మెట్టినిల్లు లాంటిది. పైగా ఇది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’.. ఘాటు వ్యవహారాలు, మోటు సరసాలు నాన్ స్టాప్ గానే ఉంటున్నాయి. దాంతో ఈ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ జనాలకు బాగా కనెక్ట్ అవుతోంది. దానికి తోడు రెండువ రోజు నుంచి భారీ టాస్క్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 2, 2022 / 11:23 AM IST
    Follow us on

    Bigg Boss Non Stop Shree Rapaka: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో కూడా రోజురోజుకు ఎమోషనల్ రివెంజ్ డ్రామాలు పెరిగిపోతున్నాయి. బిగ్ బాస్ అంటేనే గొడవలకు పుట్టినిల్లు, ప్రేమలకు మెట్టినిల్లు లాంటిది. పైగా ఇది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’.. ఘాటు వ్యవహారాలు, మోటు సరసాలు నాన్ స్టాప్ గానే ఉంటున్నాయి. దాంతో ఈ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ జనాలకు బాగా కనెక్ట్ అవుతోంది. దానికి తోడు రెండువ రోజు నుంచి భారీ టాస్క్ లు స్టార్ట్ అయ్యాయి. టాస్క్ లు స్టార్ట్ అవ్వడం అంటే.. ఒక విధంగా గొడవలకు పునాధులు వేసినట్టే.

    Bigg Boss Non Stop Shree Rapaka

    అన్నిటికీ మించి ‘బిగ్ బాస్’ ఒకవైపు స్నేహాన్ని పెంచుతూనే.. మరోవైపు పగలను రగిలిస్తున్నాడు. కంటెస్టెంట్ లు కూడా ఆవేశంతో రగిలిపోతూ.. ఒకరి మధ్య ఒకరు చిచ్చులు పెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజెర్స్ గా, పాత వారిని సీనియర్ వారియర్స్ గా విభజించి మరీ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు టాస్క్ ల్లో డోస్ లు పెంచుతున్నాడు.

    Also Read:   బిగ్ బాస్ ఓటీటీ బూతు బాగోతం: 120 మందితో ఎఫైర్ అంటా.. ఆ కంటెస్టెంట్ పరువు పాయే!

    ఇక డేర్ ఛాలెంజెస్ లో ఛాలెంజర్లు పై చేయి సాధించడానికి శతవిధాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మెయిన్ గా ముమైత్ ఖాన్ అయితే తన మీద పాత రివెంజ్ ను మనసులో పెట్టుకొని ఇప్పుడు షోలో నెగిటివ్ గా ప్రవర్తిస్తుంది అంటూ శ్రీరాపాక తెగ సీరియస్ అయిపోయింది. నెగెటివ్, పాజిటివ్ వైబ్స్ ఛాలెంజ్ లో ఎక్కువగా థమ్స్ డౌన్ అంటూ శ్రీ రాపాకకు పెట్టేయ్యడం కూడా ఆమెను తీవ్రంగా బాధించింది.

    Bigg Boss Non Stop Shree Rapaka

    అందరూ కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని శ్రీరాపాక బాగా ఫీల్ అవుతుంది. అఖిల్ తనను లాయర్ అని అనడం, ఇక ముమైత్ ఖాన్ అయితే పాత గోడవలను మనసులో పెట్టుకొని తనను టార్గెట్ చేయడం తనను బాగా బాధిస్తున్నాయి అని శ్రీపాక చెప్పుకొచ్చింది. మరోపక్క శ్రీరాపాక వివరణకు ముమైత్ బాగా హార్ట్ అయ్యింది. మరి రానున్న రోజుల్లో వీరి మధ్య ఏ రేంజ్ యాక్షన్ జరుగుతుందో చూడాలి.

    Also Read:  బిగ్ బాస్ ఓటీటీ: అవినాష్ -అరియానా కామెడీ ట్రాక్.. అజయ్ తో రిపీట్

     

    Tags