Prabhas vs Ram charan: వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పేలా లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి టైంలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ భారీ సినిమాలు ఒకేసారి వస్తాయా? డేట్లు మారుస్తారా? అనేది చూడాలి.
ఒకవేళ డేట్లు మార్చకపోతే రెండు సినిమాలకు నష్టం. అయితే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు.
Also Read: పవన్‌ను బన్నీ మర్చిపోయాడా.. సోషల్ మీడియాలో ఏందీ రచ్చ..!
పైగా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ డ్రామాలో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటించనుంది. అందుకే, ఈ భారీ బడ్జెట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి.. చరణ్ సినిమాతో పోల్చుకుంటే… ప్రభాస్ సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి.
అయితే, మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పై కూడా బాగానే ఆసక్తి ఉంది. కానీ శంకర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. మరి చివరికి ఎవరు ఎవరి పై పోటీ మానుకుంటారో చూడాలి.
Also Read: బిగ్ బాస్ ఓటీటీ: అవినాష్ -అరియానా కామెడీ ట్రాక్.. అజయ్ తో రిపీట్