https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్ గా నందమూరి సింహం.. ఇది మామూలు ట్విస్ట్ కాదండోయ్!

వారిలో తేజస్విని గౌడా, అంజలి పవన్, బంచిక్ బబ్లూ, రీతూ చౌదరీ, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం పేర్లు బయటకి వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరొకరి పేరు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ సంచలనం సృష్టించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 12, 2024 / 08:30 PM IST
    Follow us on

    Bigg Boss 8 Telugu : మరో 20 రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 8 ‘ ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కి సంబంధించి రోజుకి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ అభిమానులను థ్రిల్ కి గురి చేస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ వినని పేర్లను, అసలు వీళ్ళు బిగ్ బాస్ లోకి వస్తారా అని ఆశ్చర్యపోయే పేర్లను రోజూ వింటున్నాము. రీసెంట్ గానే ఈ సీజన్ కి సంబంధించిన ఫుల్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ని గమనిస్తే ఈ సీజన్ లో ప్రతీ ఒక్కటి అనంతం అనేది అర్థం అవుతుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే 50 శాతం కి పైగా కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ టీం అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుందట. వారిలో తేజస్విని గౌడా, అంజలి పవన్, బంచిక్ బబ్లూ, రీతూ చౌదరీ, విష్ణు ప్రియా, ఆదిత్య ఓం పేర్లు బయటకి వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరొకరి పేరు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ సంచలనం సృష్టించింది.

    Nandamuri Hero Chaitanyakrishna

    నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నందమూరి చైతన్య ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. నందమూరి చైతన్య హీరో గా పలు సినిమాలు చేసాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. జగపతి బాబు హీరో గా నటించిన ‘ధమ్’ అనే చిత్రం లో ముఖ్య పాత్ర పోషించిన చైతన్య, రీసెంట్ గానే ‘బ్రీత్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి స్థానం లో ఉన్న నందమూరి చైతన్య, ఈ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యం తో ఈ షో చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

    మరి చైతన్య అనుకున్న లక్ష్యాన్ని ఈ షో ద్వారా చేరుకుంటాడా లేదా అనేది చూడాలి. చైతన్య కి ప్రస్తుతం 49 ఏళ్ళు. ఈయన హౌస్ లోకి వచ్చి సరైన మైండ్ గేమ్ తో ఆడితే మరో శివాజీ లాంటి కంటెస్టెంట్ అవుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే గడిచిన సీజన్స్ మొత్తం 15 వారాలు మాత్రమే ఉండగా, ఈ సీజన్ లో మాత్రం 16 వారాలు ఉండేలా టీం ప్లాన్ చేస్తుందట. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చిస్తున్నారు. అలాగే ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గత సీజన్ లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. నయనీ పావని కి ఆ అవకాశం దక్కినట్టు టాక్ వినిపిస్తుంది. ఈమె గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి, బాగా ఆడినప్పటికీ కూడా మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.