https://oktelugu.com/

‘వకీల్ సాబ్’ పై పోలీసులకు ఫిర్యాదు

వకీల్ సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. రికార్డులు కొల్లగొట్టింది. అయితే దాని చుట్టూ వివాదాలు తాాజగా ముసురుకుంటున్నాయి. తాజాగా వకీల్ సాబ్ చిత్రంపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమతి లేకుండా వకీల్ సాబ్ చిత్రంలో ఓ సన్నివేశంలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించారంటూ సుధాకర్ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హీరోయిన్ అంజలిని […]

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2021 / 08:38 AM IST
    Follow us on

    వకీల్ సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. రికార్డులు కొల్లగొట్టింది. అయితే దాని చుట్టూ వివాదాలు తాాజగా ముసురుకుంటున్నాయి.

    తాజాగా వకీల్ సాబ్ చిత్రంపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమతి లేకుండా వకీల్ సాబ్ చిత్రంలో ఓ సన్నివేశంలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించారంటూ సుధాకర్ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    హీరోయిన్ అంజలిని పోర్న్ గర్ల్ గా మార్చినట్లు సినిమాలో చూపించిన సన్నివేశంలో కింద అంజలిని కాంటాక్ట్ కావాల్సిన వారు ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

    అయితే నా ఫోన్ నంబర్ ను అంజలి కింద వేశారని.. దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిరంతరం ఫోన్లు వస్తున్నాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    చిత్రం యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. అయితే పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఇంకా కేసు నమోదు చేయలేదు.