
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపై అఖిల భారత హిందూసభ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ సేతుపతి గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో విజయ్ సేతుపతి హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఖిల భారత హిందూ మహాసభ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాయడంతోపాటు త్రిచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం
సొంత పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్లపై విజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని వారు హెచ్చరించారు. అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు విజయ్ దెబ్బతీశాడని ఆ లేఖలో పేర్కొంది. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో కారణం చెప్పాలని డిమాండ్ చేసింది. సొంత ప్రచారం చేసుకోవడానికే హిందూ మతమే దొరికిందా? అంటూ ఆయనపై మండిపడ్డారు. ఇదిలాఉంటే విజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. మీమ్స్ తో నెటిజన్లు విజయ్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. అఖిల భారత హిందూసభ సభ్యులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెనలో విలన్ గా నటిస్తున్నాడు.