South Box Office: కరోనా మూడో వేవ్ ప్రభావం ఎక్కువగా లేదు. దాంతో వరుస సినిమాల రిలీజ్ డేట్స్ ను వదులుతున్నారు ఫిల్మ్ మేకర్స్ . అయితే, ఈ క్రమంలో భారత చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ చిత్రాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’, ఫైనల్ గా మార్చి 25న వస్తున్నట్టు ఇటీవలే ఆర్ఆర్ఆర్ మేకర్స్ ప్రకటించారు. అలాగే రాధేశ్యామ్ సినిమాను కూడా మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా తెలిపారు.

కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగింది. ఇక రాజమౌళికి కూడా దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో 2 వారాల వ్యవధిలో వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద ఢీ కొడుతున్నారు. అందుకే, ప్రభాస్ వెర్సస్ రాజమౌళి అన్నట్టు ఉంది పరిస్థితి. నిజానికి మొదటి నుంచి రాధేశ్యామ్ సినిమా.. ఆర్ఆర్ఆర్ సినిమానే టార్గెట్ చేస్తూ వస్తోంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేసిన తర్వాత, రాధేశ్యామ్ సినిమా రిలీజ్ ను, ఆ తర్వాత వారమే అని ప్రకటించారు.

Also Read: ‘ఓటీటీ’ : ఈ వీక్ సినిమాల పరిస్థితేంటి ?
మరి వీరిద్దరి సినిమాల్లో ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను కలెక్ట్ చేస్తుందో చూడాలి. అలాగే మరో భారీ ఫైట్ కూడా ఉంది. బైక్ రేసింగ్ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వలిమై చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 24న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్దమైనట్టు మేకర్స్ ప్రకటించారు. పైగా తెలుగు యువ హీరో కార్తికేయ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.
అయితే ఫిబ్రవరి 25న కానీ, ఏప్రిల్ 1న కానీ భీమ్లా నాయక్ వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. మరి ఒకవేళ భీమ్లా నాయక్ కూడా ఫిబ్రవరి 25న రిలీజ్ అయితే ఏమిటి పరిస్థితి ? కలెక్షన్స్ ను రెండు సినిమాలు పంచుకొవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి వలిమై విడుదల ఉంది కాబట్టి.. ఇక భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి పోస్ట్ ఫోన్ అవుతాడేమో చూడాలి. అదేంటో గానీ, మొదటి నుంచి భీమ్లా నాయక్ కి ఇలా పోస్ట్ ఫోన్ అవ్వడమే సరిపోతుంది.
[…] […]
[…] […]