Homeఎంటర్టైన్మెంట్Satya Jatley Trailer Review: కమెడియన్ సత్య 'జెట్లీ' ట్రైలర్ రివ్యూ : ఈసారి కామెడీ...

Satya Jatley Trailer Review: కమెడియన్ సత్య ‘జెట్లీ’ ట్రైలర్ రివ్యూ : ఈసారి కామెడీ వర్కౌట్ అయ్యేలా లేదే..

Satya Jatley Trailer Review: తన కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు సత్య. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైనా ఈయన ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను సంపాదించి , అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఒకప్పుడు బ్రహ్మానందం సినిమాలో ఉంటే చాలు , కళ్ళు మూసుకొని టికెట్స్ ని కొనుగోలు చేసేవాళ్ళు ఆడియన్స్, అలాంటి ఇమేజ్ నేటి తరం కమెడియన్స్ కి అసాధ్యమని అంతా అనుకున్నారు, కానీ కమెడియన్ సత్య ఆ రేంజ్ కి చేరుకున్నాడు. గొప్పగా లేని సన్నివేశాలను కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వు రప్పించగల కెపాసిటీ సత్య సొంతం. అయితే ఇప్పుడు ఆయన హీరో గా నటించిన ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అనే చిత్రం మే 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి , పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల ఒక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి నటీనటులందరూ సినిమాలో పోషించిన గెటప్స్ తోనే ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే ఈరోజు విడుదల చేసిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ చిత్రానికి నితీష్ రానా దర్శకుడు. ఇప్పటి వరకు ఆయన ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్ డే’, ‘మత్తు వదలరా 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ స్టైల్ కామెడీ చాలా కొత్తగా ఉంటుంది , అర్థం చేసుకున్నోళ్ళు ఆయన సినిమాలను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు.

అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నాడు నితీష్ రానా. అయితే నేడు విడుదల చేసిన ట్రైలర్ , ఆయన ఆడియన్స్ కి కూడా పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి. ఆయన మార్క్ కామెడీ టైమింగ్ ప్రయత్నం చేసాడు కానీ , ఎందుకో పెద్దగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించలేదు. ఒక్క జోక్ కి కూడా నవ్వు రాలేదు. సత్య చాలా వరకు తన కామెడీ టైమింగ్ తో లేపే ప్రయత్నం చేశాడు కానీ , అక్కడ రైటింగ్ లో పస లేనప్పుడు సత్య మాత్రం ఎంత వరకు లేపగలడు చెప్పండి అంటూ సోషల్ మీడియా లో ఈ ట్రైలర్ ని చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్ మీకు నచ్చిందా?, మీ అభిప్రాయాన్ని క్రింద అందిస్తున్న ఈ ట్రైలర్ ని చూసి కామెంట్స్ చేయండి.

 

 

JETLEE Trailer | Satya | Ritesh Rana | Rhea Singha | Vennela Kishore | Kaala Bhairava

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version