Brahmanandam
Brahmanandam : సినిమాల్లో హీరోలు యాక్షన్, డ్యాన్స్ వంటివి అవలీలగా చేయగలరు కానీ, కామెడీ ని మాత్రం చేయలేరు. కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు ఎలాంటి పాత్రలైనా పోషించగలరని సీనియర్స్ అంటుంటారు. కానీ కామెడీ టైమింగ్ పండించడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. సీనియర్ హీరోలలో కామెడీ టైమింగ్ అంటే మనకి గుర్తుకొచ్చే హీరోలు విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో మాస్ హీరోగా ఎన్నో వీరోచిత పోరాటాలు సన్నివేశాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి, కామెడీ టైమింగ్ లో కింగ్ అని చెప్పొచ్చు. ఆయన కామెడీ చేస్తే పక్కన ఉన్న కమెడియన్స్ కూడా డామినేట్ అయిపోతారు. ఇది ఆయన పాత సినిమాలు చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. కామెడీ కింగ్ బ్రహ్మానందం ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన హీరో మెగా స్టార్ చిరంజీవి నే. అందుకే బ్రహ్మానందం ఇప్పటికీ కూడా జంధ్యాల, చిరంజీవి నాకు గురువులు దైవ సామానులు అని చెప్తుంటారు.
రీసెంట్ గా ఆయన తన కుమారుడు గౌతమ్ తో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రం చేసాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘హీరోస్ లో నాకు తెలిసి చిరంజీవి గారి లాగ కామెడీ చేసిన హీరో ఎవరూ లేరు. ప్రతీ ఒక్క హీరోకి కామెడీ లో వారి స్టైల్ లో టైమింగ్ ఉంటుంది కానీ, మెగాస్టార్ కామెడీ ఎవర్గ్రీన్. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను. చిరంజీవి గారి తదుపరి చిత్రాల్లో కూడా కచ్చితంగా ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కుతుందని కోరుకుంటున్నాను’ అంటూ బ్రహ్మానందం మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
బ్రహ్మానందం మూడు తరాల హీరోలతో కలిసి సినిమాలు చేసాడు. అందరితోనూ ఆయనకీ ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి గురించే ఆయన అంత ప్రత్యేకించి చెప్పాడంటే ఆయన కామెడీ టైమింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వేరే ఎవరైనా చెప్తే పర్వాలేదు, కామెడీ లో ఆరితేరి హాస్య బ్రహ్మ అనిపించుకున్న బ్రహ్మానందం లాంటి నటుడు నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం చిరంజీవి స్థాయి ఎలాంటిదో చూపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలలో విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
BhramaAmandam gari down fall kosam wait cheyali next
pic.twitter.com/yc2rKZdf5n— Aravind (@aravindcherry) February 3, 2025