Tandel Movie : అక్కినేని నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. ట్రైలర్, పాటలతో ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ ని ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం, ప్రొమోషన్స్ తో మరింత హైప్ ని ఏర్పాటు చేసుకుంది. కానీ హైప్ కి తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ లేవు అనే భావన ట్రేడ్ పండితుల్లో కలుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో నిన్ననే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. 24 గంటల్లో కేవలం 6 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. అది కూడా హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ థియేటర్స్ లో బుకింగ్స్ ప్రారంభించడం వల్లే ఆ మాత్రం టికెట్స్ అయినా సేల్ అయ్యాయి అని అంటున్నారు.
ఓవర్సీస్ లో కూడా అనుకున్న స్థాయి లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని జనాలు ఎగబడి చూసేసారు. ఆ చిత్రానికి భారీగా ఖర్చు చేయడం వల్లే ‘తండేల్’ మీద ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చు అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ ట్రెండ్ ని చూసిన తర్వాత కూడా నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసారు. సింగల్ స్క్రీన్స్ లో 50 రూపాయిలు పెంచుకునే వేసుకుబాటు ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అదే విధంగా మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో కూడా 50 రూపాయిలు పెంచుకోవచ్చు అట. ఆంధ్ర ప్రదేశ్ లో ‘సలార్’ తో సమానమైన టికెట్ రేట్స్ పెట్టుకున్నారు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్ పై నెగటివ్ చూపిస్తుందా, లేదా పాజిటివ్ చూపిస్తుందా అనేది రేపు చూడాలి.
రేపు ఉదయం జీవో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాకి చాలా బడ్జెట్ పెట్టామని, తెలంగాణ లో టికెట్ హైక్స్ ఇవ్వరని తెలుసు కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్స్ కోసం ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చాడు ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన బన్నీ వాసు. కానీ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో అంత రేట్స్ పెట్టి టికెట్స్ ని కొనుగోలు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపు సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజ జీవితం లో జరిగిన యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఊహించని వసూళ్లు వస్తాయి కానీ, భారీ ఓపెనింగ్స్ కి జరగాల్సిన అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇవి కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో బుకింగ్స్ ట్రెండ్ మారుతుందో లేదో చూడాలి.