Akhanda: అది అసలు సమస్యే కాదు… అఖండ తో బాలయ్య నిరూపించాడుగా

Akhanda: టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బడా నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం అంటున్నారు.తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ గా ఏపీ ఉండగా… పరిశ్రమ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేసిన తర్వాత విడుదలైన పెద్ద సినిమా అఖండ. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ పై […]

Written By: Neelambaram, Updated On : December 7, 2021 11:21 am
Follow us on

Akhanda: టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బడా నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం అంటున్నారు.తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ గా ఏపీ ఉండగా… పరిశ్రమ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేసిన తర్వాత విడుదలైన పెద్ద సినిమా అఖండ. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ పై టికెట్స్ ధరల ప్రభావం ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Akhanda

అయితే అఖండ ఈ అడ్డంకిని విజయవంతంగా అధిగమించినట్లు స్పష్టం అవుతుంది. తగ్గిన టికెట్స్ ధరలు బాలయ్య ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. దానికి అఖండ వసూళ్ల లెక్కలే నిదర్శనం. బాలయ్య కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న అఖండ కేవలం నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు రూ. 59 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజులకు గాను రూ. 37.56 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక ఒక్క ఏపీ నుండి నాలుగు రోజుల్లో రూ. 26 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అందుకుంది. ఆదివారం వసూళ్లలో గ్రోత్ కనిపించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైందని ట్రెండ్ వర్గాలు అంటున్నారు. దీన్ని బట్టి టికెట్స్ ధరల తగ్గింపు, బెనిఫిట్ షోలు రద్దు వంటి విషయాలు అఖండ మూవీ పై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని స్పష్టంగా అర్థం అవుతుంది.

Also Read: RRR Movie: ఊహకందని రేంజ్​లో ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​.. గ్రాండ్​గా ట్రైలర్​ రిలీజ్​కు ఏర్పాట్లు

అఖండ మూవీ చూడడానికి ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తుతుండగా పాత రేట్లకే టికెట్స్ అమ్ముతున్నారని సమాచారం.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్స్ ఎవరూ అమ్మక పోవడం కూడా దీనికి కారణం. మరోవైపు ఈ ప్రతికూల పరిస్థితిని ధీటుగా ఎదుర్కున్న అఖండ చిత్ర విజయం… విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాల దర్శక నిర్మాతల్లో ధైర్యం నింపింది. సినిమాలో విషయం ఉంటే వసూళ్ల వరద పారుతుందని, టికెట్స్ ధరలు సమస్యే కాదన్న అభిప్రాయం బలపడింది.

Also Read: Niharika: స్పెయిన్​లో నిహారికా స్కూబా డైవింగ్​.. నెట్టింట్లో వీడియో వైరల్

Tags