Homeఎంటర్టైన్మెంట్Uday Kiran: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం వాళ్లే .. షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్...

Uday Kiran: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం వాళ్లే .. షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్

Uday Kiran: బుల్లితెర పై జబర్దస్త్ షో ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులారిటీ దక్కించుకున్నారు. అలాంటి వారిలో షేకింగ్ శేషు ఒకరు. జబర్దస్త్ లో షేకింగ్ శేషు స్టార్ కమెడియన్ గా వెలిగాడు. తనదైన శైలిలో ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో కడుపుబ్బా నవ్వించేవారు. అలా జబర్దస్త్ లో రాణిస్తున్న సమయంలో ఆయనకు సినిమా ఆఫర్స్ రావడంతో షో నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల కాలంలో శేషు సినిమాల్లో కూడా కనిపించడం లేదు. దాంతో షేకింగ్ శేషు ఏమయ్యాడో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో శేషు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత పరిస్థితి గురించి పలు విషయాలు తెలియజేశాడు. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ మృతి పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనిల్ రావిపూడి ‘ సుప్రీం ‘ సినిమాలో అవకాశం ఇచ్చారట.

ఆఫర్స్ పెరగడంతో సినిమాలు జబర్దస్త్ రెండు మ్యానేజ్ చేయలేక షో మానేశారట శేషు. అలా సినిమాల్లో వరుసగా ఆఫర్లు వచ్చాయట. కానీ ఇటీవల అవకాశాలు కరువయ్యాయని, తమను పట్టించుకునేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలి అనిపించిందని, కుటుంబాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకున్నట్టే అని అన్నాడు. గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే బాధగా ఉంటుందన్నారు శేషు.

ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ కూడా అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. ఆయన చావుకు ఆఫర్లు ఇవ్వని వాళ్ళు కూడా కారణమని అని ఉన్న విషయం చెప్పేశాడు. షేకింగ్ శేషు కామెంట్స్ వైరల్ గా మారాయి. ఉదయ్ కిరణ్ చనిపోయి చాలా కాలం అవుతున్నప్పటికి వార్తలు వస్తూనే ఉంటున్నాయి. ఉదయ్ కిరణ్ నిజంగా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పూర్తిగా తెలియదు. ఆయన మరణం ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.

Exit mobile version