https://oktelugu.com/

Indian 3 : మొదలైన ‘ఇండియన్ 3 ‘ షూటింగ్..’గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ కి శంకర్ పంగనామం.. అసహనంలో రామ్ చరణ్!

సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ల్స్ ని కూడా ఈ చిత్రం ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా చివర్లో వేసిన 'ఇండియన్ 3' ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వాస్తవానికి శంకర్ ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా తీద్దాం అని అనుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 07:42 PM IST

    Indian 3 shooting

    Follow us on

    Indian 3 :  శంకర్ తెరకెక్కించిన చిత్రాలలో ‘ఇండియన్’ కి ఉన్న ప్రత్యేకత వేరు. ఈ సినిమాలోని సేనాపతి పాత్ర ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు. కమల్ హాసన్ ని ఆ పాత్రలో చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంతటి అద్భుతమైన పాత్రని శంకర్ ‘ఇండియన్ 2’ తో సర్వనాశనం చేసేసాడు. భారీ అంచనాల నడుమ ఈ ఏడాది విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇదేమి నీచమైన సినిమారా బాబు, బాలయ్య ‘ఒక్క మగాడు’ చిత్రం వెయ్యి రెట్లు బెటర్ కదా అని అనిపించింది. అంత దారుణంగా తెరకెక్కించాడు శంకర్ ఈ చిత్రాన్ని. సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ల్స్ ని కూడా ఈ చిత్రం ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా చివర్లో వేసిన ‘ఇండియన్ 3’ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వాస్తవానికి శంకర్ ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా తీద్దాం అని అనుకున్నాడు.

    కానీ బడ్జెట్ లిమిట్ ని దాటిపోవడంతో రెండు భాగాలుగా విభజించారు. ఫలితంగా వచ్చిన ప్రోడక్ట్ ‘ఇండియన్ 2’ అనే కళాఖండం. కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 చేయడానికి ముఖ్య కారణం ‘ఇండియన్ 3’ అని, చాలా అద్భుతంగా ఆ సినిమా వచ్చిందంటూ ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అప్పుడే ఆడియన్స్ కి అర్థమైంది, కమల్ మాటలకు అర్థం ‘ఇండియన్ 2’ ఎత్తిపోయింధీ అనా..? అని అందరూ అనుకున్నారు. చివరికి అదే నిజమైంది. అయితే ‘ఇండియన్ 2’ ఫ్లాప్ అయ్యింది కదా , ‘ఇండియన్ 3’ ఇక రాదేమోలే అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది అని మేకర్స్ అంటున్నారు. అన్ని కుదిరితే డిసెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవాకాశం ఉందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదల అవుతుందా?, లేదా థియేటర్స్ లో విడుదల అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

    ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసాడు శంకర్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తో శంకర్ ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేసాడు . రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా జనవరి 10 వ తారీఖున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని లక్నో లో విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. వచ్చే నెల నుండి ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రొమోషన్స్ కి ఇండియన్ 3 షూటింగ్ కారణంగా శంకర్ పంగనామం పెట్టబోతున్నాడా?, ఎందుకంటే నిన్న లక్నో లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి కూడా శంకర్ రాలేదు, ఈ విషయంలో రామ్ చరణ్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.