Homeఎంటర్టైన్మెంట్Comedian Raja Babu: రాజసులోచన వాచ్‌మెన్ కు రాజబాబు సాయం !

Comedian Raja Babu: రాజసులోచన వాచ్‌మెన్ కు రాజబాబు సాయం !

Comedian Raja Babu: Rajababu Helps Rajasulochana Watchmen

Comedian Raja Babu: హాస్య నటుడు రాజబాబు (Raja Babu) అనగానే చాలా మందికి వెలికి నవ్వు గుర్తుకు వస్తుంది. కానీ తోటి వారి మేలెరిగిన మహా మనిషి రాజబాబు. గతంలో ఎప్పుడో తనకు మంచినీళ్లు ఇచ్చి తన దాహం తీర్చారని.. వారిని గుర్తుపెట్టుకుని వారి రుణం తీర్చుకున్న మహానుభావుడు రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను రెండు దశాబ్దాల పాటు ఏలారు. అయినా ఎన్నడూ ఎవరితో ఎలాంటి గొడవ పడలేదు అంటే.. అది ఒక్క రాజబాబుకే చెల్లింది.

అందుకే రాజబాబు అంటే.. అందరూ ఇష్టపడవారు. రాజబాబు తన జీవితాన్ని బడి పంతులుగా మొదలుపెట్టారు. మిమిక్రీ, నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకి క్రమంగా నటనపై మనసు మళ్లి, మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేశారు. గొప్ప హాస్యనటుడిగా ఎదిగారు. అసలు ఆయన కాల్షీట్లు ఎప్పుడూ ఖాళీ ఉండేవి కాదు. రెండు చేతులా సంపాదించడం మొదలుపెట్టాక ఎంతోమందికి ఎంతో మేలు చేశారు.

తన జీవిత కాలంలో ఆయన 78 మందికి సొంత ఖర్చులతో వివాహం జరిపించారు. 68 మందికి విద్యాదానం చేశారు. సేవా సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. మద్రాసులో సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఆకలితో పడుకున్నపుడు మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ఓ వాచ్‌మెన్ ను గుర్తుపెట్టుకుని ఆర్థిక సాయం కూడా చేశారు. ఇంతకీ ఆ వాచ్‌మెన్ ఎవరో తెలుసా ? రాజసులోచన ఇంటి వాచ్‌మెన్ అట.

అప్పట్లో తన నాటకాలను ఆదరించిన పేద పారిశుద్ధ్య కార్మికులకు, రిక్షా వాళ్లకు తన సొంత డబ్బుతో రాజమండ్రిలోని దానవాయిపేటలో భూమిని కొని ఉచితంగా పట్టాలిచ్చారు. కోరుకొండలో కళాశాల కూడా కట్టించారు. ఒక విధంగా ఆయన సేవ చేయడానికే సంపాదిస్తున్నారా అన్నట్టు ఉండేది ఆయన సేవ. ఏది ఏమైనా ఆయన ఎప్పటికే రాజబాబే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular