
Malyalam Actress Nimisha: మలయాళ సీరియల్ నటి నిమిషా అరెస్ట్ సంచలనం సృష్టించింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ పై విడుదల అయి ఇంటికి వెళ్లింది. అయితే ఆమె చేసిన నేరం ఏంటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మధ్య సెలబ్రిటీల అరెస్టు మామూలుగా అయిపోయింది. చిన్న విషయాలకైనా అరెస్టులు చేస్తూ తరువాత బెయిల్ పై విడుదల చేయడం మామూలుగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల ప్రభావంతోనే ఇలా జరుగుతున్నాయని తెలుస్తోంది. మలయాళ సీరియల్ నటి నిమిషా శనివారం అరెస్టు కావడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.
దేవాలయ ఆచారాలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. శనివారం నిమిషాను అరెస్టు చేసిన పోలీసులు స్టేట్ మెంట్ నమోదు చేశారు. ఆమెతో పాటు స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకుని తరువాత బెయిల్ పై విడుదల చేశారు. నిమిషా తన స్నేహితులతో కలిసి ప్రసిద్ధ ఆరమ్మల దేవాలయంలోని పల్లియోదం అనే పడవను చూడటానికి వెళ్లింది. కానీ అక్కడ పాదరక్షలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. దీంతో దేవాదాయ సమితి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు ఆధారంగా నిమిషను ఆమె స్నేహితుడు ఉన్ని మీద కూడా కేసు పెట్టారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పోలీసులు ఆమెపై సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పల్లియోడం అనేది పంబా నదిలో ప్రసిద్ధి చెందిన నీటి ఊరేగింపు కోసం పట్నం తిట్ట జిల్లాలోని అరణ్ముల దేవాలయం ఉపయోగించే పాము పడవ. ఈ పడవకు పురాణ గాథ కూడా ఉంది. దీన్ని జాక్ ఫ్రైట్ తో తయారు చేసిందని చెబుతారు. దీంతో నిమిషపై కేసు నమోదు చేశారు.
అంతి ప్రాశస్త్యం కలిగిన పడవపై బూట్లు వేసుకుని ఉండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ సంప్రదాయాన్ని అవమానపరచడమేనని అందరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. దీంతో ఆమెపై కేసు పెట్టడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే నిమిష తన ఫొటోలను తరువాత తీసేసినా అప్పటికే ప్రచారం సాగిపోవడంతో ఆమెకు చిక్కులు తప్పలేదు.