Comedian Prudhvi: పనికిమాలిన క్యారెక్టర్ చేయమన్నారు : బ్రో సినిమా గురించి కమెడియన్ షాకింగ్ కామెంట్స్..

అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు చేశాను. ఇది నాలుగోది. ఈ సినిమా విడుదలకాగానే నా పాత్ర పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ అయిపోయింది.

Written By: Swathi, Updated On : August 1, 2023 4:44 pm

Comedian Prudhvi

Follow us on

Comedian Prudhvi: పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. తమిళంలో సముద్రఖని, తంబిరామయ్య ముఖ్యపాత్రల్లో నటించిన వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా వచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఈ సినిమా యూనిట్.

ఈ సక్సెస్ మీట్ లో ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించిన కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా చెప్పి ఫాన్స్ ని మరింత ఖుషి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు పృథ్వి శ్యాంబాబు పాత్రలో కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ అని అర్ధమవుతుంది. గతంలో సంక్రాంతికి అంబటి రాంబాబు రోడ్డు మీద డ్యాన్స్ వేశారు. అదే డ్యాన్స్, అదే డ్రెస్ వేయించి పృథ్వీతో సినిమాలో చేయించారు.

ఇక ఈ క్యారెక్టర్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పృథ్వి. సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..‘రోరింగ్ లయన్ పక్కన ఫొటో దిగడం ఒక అదృష్టం. అలాంటిది ఆయనతో ఇదివరకు మూడు సినిమాలు చేశాను. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు చేశాను. ఇది నాలుగోది. ఈ సినిమా విడుదలకాగానే నా పాత్ర పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ అయిపోయింది. సినిమాలో మంచి ఉందిరా నాయన.. టైమ్ వాల్యూ తెలుసుకోండిరా.. మీరు ఎంత సంపాదించినా రేపు పొద్దున్న వెళ్లిపోవాల్సింది మట్టిలోకేరా.. మానవ సంబంధాలు తెలుసుకోండి.. టైమ్ లేదని చెప్పకండి అన్నారు. మానవ సంబంధాలను అంత గొప్పగా చూపించిన సముద్రఖని గారికి హ్యాట్సాఫ్. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. కెమెరామేన్ గారిని చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. టీవీల్లో నంబర్ ఆఫ్ షాట్స్.. ఎక్కడ చూసినా శ్యాంబాబు, రాంబాబు. మంత్రి గారిని ఈ విధంగా డీగ్రేడ్ చేయడమేంటని నన్ను చాలా మంది అడిగారు. ఎవరండి మంత్రి అంటే.. అంబటి రాంబాబు అన్నారు. ఆయనెవరో నాకు తెలీదు అన్నాను. నాకు తెలీదండి.. తెలియనోడి గురించి నేనెందుకు చేస్తాను అన్నాను. అయినా ఆస్కార్ లెవల్లో నటుడేం కాదు అతను.. ఆయన్ని నేనెందుకు ఇమిటేట్ చేస్తాను అన్నాను’ అని చెప్పుకొచ్చాడు ఈ నటుడు.

ఇక ఈ క్యారెక్టర్ గురించి దర్శకుడు తనకు చెప్పిన మాటల గురించి చెబుతూ..’నాకు సముద్రఖని ఏం చెప్పారంటే.. ఒక పనికిమాలిన వెధవ, బాధ్యతలేని వెధవ, బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు, ఇదీ మీ క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన చెప్పింది నేను చేయాలి. నేను బయటికి వెళ్లి వచ్చినా సినిమా రంగం నన్ను అక్కున చేర్చుకుంది. నాకు మళ్లీ పాత రేటు ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు. డబ్బులు బాగా ఇచ్చారు. ఆ సీన్ చూసి థియేటర్లలో నవ్వుతున్నారు. ఆ క్రెడిట్ అంతా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది ఈ పాత్ర’ అని పృథ్వీ తెలియజేశారు.