Brahmanandam: లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఒక మామూలు కాలేజ్ లెక్చరర్ గా కెరీర్ మొదలు పెట్టిన బ్రహ్మానందం ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా ఎదిగారు. బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కామెడీనే కాదు ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోయి రక్తి కట్టిస్తారు. ఇటీవల వచ్చిన రంగమార్తాండ(Ranga Maarthaanda) సినిమాలో సీరియస్ రోల్ చేసి కన్నీరు పెట్టించారు.
రంగమార్తాండ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర గుండెలు బరువెక్కిస్తుంది. కొన్ని కారణాలతో కాస్త జోరు తగ్గించారు. పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తున్నారు. అయినా బ్రహ్మానందం మీమ్స్ ప్రతిరోజూ మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. మీమర్స్ ఆయన్ని ‘ మీమ్ గాడ్ ‘ అని పిలుచుకుంటారు. ఆయన నటించిన ఐకానిక్ మూవీ సీన్స్ మీమర్స్, ట్రోలర్స్ వాడుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కమెడియన్ మధునందన్(Comedian Madhunandan) బ్రహ్మానందం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ .. బ్రహ్మానందం అంటే ఎంతో గౌరవం, ఆరాధనా భావం ఉంటుందని అన్నారు. ఇక ఫస్ట్ టైం ఆయనతో గీతాంజలి సినిమా కి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాం అని తెలిసినప్పుడు చాలా భయపడ్డాడట, ఎలా ఉంటారో అని టెన్షన్ పడ్డాడట. పైగా సెట్ లో బ్రహ్మానందం వస్తున్నారు అంటే మామూలు హడావుడి ఉండేది కాదని, ఓ రకంగా తమని వణికించే వారని మధునందన్ అన్నారు.
ఆయన మొదట్లో మనకు గాంభీర్యంగా అనిపిస్తాడు. కానీ ఆయనకు మనం అలవాటైతే చాలా ఫ్రీగా ఉంటారు. చాలా సరదాగా ఉంటూ, బాగా ఎంకరేజ్ చేస్తారట. ఇలా కాదు అలా అని మెళకువలు చెబుతాడట. ఆయన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వందల సినిమాలు చేసి లెజండరీ హాస్య నటుడిగా నిలిచారు. అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అందరితోనూ చాలా జోవియల్ గా మాట్లాడతారని చెప్పాడు. గీతాంజలి, దొంగాట, గరం వంటి సినిమాల్లో బ్రహ్మానందం తో కలిసి పని చేశానని మధునందన్ చెప్పుకొచ్చాడు.