Homeఎంటర్టైన్మెంట్Comedian Dhanraj:ప్రపంచంలో ప్రముఖ క్రికెటర్ తో ధన్ రాజ్ సెల్ఫీ..: పిక్ వైరల్

Comedian Dhanraj:ప్రపంచంలో ప్రముఖ క్రికెటర్ తో ధన్ రాజ్ సెల్ఫీ..: పిక్ వైరల్

Comedian Dhanraj :టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఒక్కరూ తమదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.  అలాంటి వారిలో ధన్ రాజ్ ఒకరు. మొదట్లో సినిమాల్లో కనిపించిన ధన్ రాజ్ ఆ తరువాత టీవీ షోల్లో అలరించారు. రామ్ పోతినేని నటించిన జగడం సినిమాలో ధన్ రాజ్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అయితే ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఆయన ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయాడు. ఇదే సమయంలో జబర్దస్త్ ఆడిషన్స్ లో పాల్గొనడంతో ఆయనకు అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఆయనను టీం లీడర్ చేయడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో బీజీగా ఉన్న ధన్ రాజ్ తాజాగా సోషల్ మీడియాలో ట్రెండీగా మారారు. ప్రముఖ క్రికెటర్ తో కలిసి సెల్ఫీ దిగిన ఫొటో ఒకటి నెట్టింట్లో అప్లోడ్ చేశారు. ఆ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ధన్ రాజ్ సినీ కెరీర్ ఆసక్తిగా ఉంది. సాధారణంగా టీవీ షోల్లో నటించిన వారు ఆ తరువాత సినిమాల్లోకి వెళ్లారు. కానీ ముందే సినిమాల్లో అలరించిన ఆయన తరువాత జబర్దస్త్ ద్వారా టీవీ షోల్లో కనిపించారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో జబర్దస్త్ లో అవకాశం తెచ్చుకున్నారు. అయితే జబర్దస్త్ షో ధన్ రాజ్ కు కలిసొచ్చింది. ఇందులో ఆయన చేసిన కామెడీ ఆకట్టుకోవడంతో ధన్ రాజ్ కు విపరీతంగా అభిమానులు పెరిగారు. ఇప్పుడు జబర్దస్త్ హవా తగ్గడంతో మళ్లీ సినీ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో ఆయన లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు.

కొన్ని రోజుల కిందట మంచు లక్ష్మితో కలిసి మెయిన్ రోల్ లో నటించేందుకు రెడీ అయ్యారు. ఆ సినిమా ప్రారంభం కూడా అయింది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ మధ్య ధన్ రాజ్ నిర్మాతగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. కొన్ని సినిమాలకు డబ్బులు పెట్టడంతో అవి తిరిగా రాలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయాడు. ఈ కారణంగా మరోసారి ఆయన నిర్మాత ప్రయత్నాలు చేయలేదు. నటుడిగానే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జబర్దస్త్ ద్వారా మంచి పారితోషికం అందుకున్న ఆయన లైఫ్లో సెటిల్ అయ్యాడు.

తాజాగా ధన్ రాజ్ సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని చెప్పే ధన్ రాజ్.. ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్ తో సెల్ఫీ దిగాడు. ప్రపంచంలోనే అతి భీకరమైన బ్యాట్స్ మెన్ లో ఒకరైన క్రిస్ గేల్ తో సెల్ఫీ తీసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ధన్ రాజ్ కొత్త లుక్ లో కనిపించాడు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాడు. అయితే ఇప్పుడు ధన్ రాజ్ సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version