https://oktelugu.com/

Comedian Ali Daughter: కూతురు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్ అలీ

Comedian Ali Daughter: బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేసి చిన్న చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టి, హీరో గా కమెడియన్ గా తనకంటూ ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పర్చుకున్న నటుడు అలీ..ఇండస్ట్రీ లో ఒక్క కమెడియన్ గా ఈయనకి ఎలాంటి స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎన్నో వందల సినిమాల్లో నటించి ఇప్పటికి కూడా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా కొనసాగుతూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ గా ఉంటూ వైసీపీ పార్టీ తరుపున పని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 14, 2022 / 02:45 PM IST
    Follow us on

    Comedian Ali Daughter: బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేసి చిన్న చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టి, హీరో గా కమెడియన్ గా తనకంటూ ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పర్చుకున్న నటుడు అలీ..ఇండస్ట్రీ లో ఒక్క కమెడియన్ గా ఈయనకి ఎలాంటి స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎన్నో వందల సినిమాల్లో నటించి ఇప్పటికి కూడా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా కొనసాగుతూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ గా ఉంటూ వైసీపీ పార్టీ తరుపున పని చేస్తున్నాడు..ఇది ఇలా ఉండగా ఇటీవల తన కూతురు సాధించిన ఒక్క అరుదైన ఘనత కి అలీ ఆనందం తో కంటతడి పెట్టుకున్నారు..ఒక్క తండ్రిగా ఆయన ఈరోజు గర్వపడే స్థాయి లో ఉన్నాడు అనే చెప్పాలి..ముందుగా అలీ గారు కుటుంబం విషయానికి వస్తే అలీ గారు జుబేదా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే ఈ ఇద్దరి దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు ఒక్క కొడుకు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క కూతురు పేరు మొహమ్మద్ జువేరియా మేతి మరియు పెద్ద కూతురు పేరు మొహమ్మద్ ఫాతిమా రెమీజున్..చిన్న కూతురు జువేరియా అలీ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ‘ అనే సినిమాలో చిన్న క్యారక్టర్ కూడా చేసింది.

    Comedian Ali Daughter

    ఇక అసలు విషయానికి వస్తే అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే తన డాక్టర్ చదువుని పూర్తి చేసుకుంది..ఈ విషయం గురించి అలీ మాట్లాడుతూ ‘ఒక్క తండ్రిగా ఈరోజు నేను ఎంతో గర్వపడుతున్నాను..చిన్నప్పటి నుండి నేను నా కూతుర్ని డాక్టర్ చెయ్యాలని ఎంతో తపించాను..నా కూతురుకి కూడా డాక్టర్ వృత్తి పై ఎంతో ఆసక్తి ఉండడం వల్ల ఆమెని మెడికల్ కాలేజీ లో చేర్పించాను..మొత్తానికి కస్టపడి చదివి ఈరోజు డాక్టర్ అయ్యింది..దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, నా కుటుంబం నుండి ఒక్క డాక్టర్ ఉంది అనే ఫీలింగ్ నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది..నాకు ఇలాంటి జీవితం ని ఇచ్చిన ఆ అల్లా కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు అలీ..తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అలీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..ఇది ఇలా అనగా అలీ కి సంబంధించిన ఒక్క న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

    Also Read: షాకింగ్ : అక్కడ ఆర్ఆర్ఆర్ కి 20 కోట్లు, కేజీఎప్ కి 45 కోట్లు !

    అదేమిటి అంటే ఇటీవలే సినీ నటి మరియు శాసన సభ్యురాలు రోజా గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారు తన కాబినెట్ లో మంత్రి పదవిని ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ కారణంగా అదనపు బాధ్యతలు ఆమె పై ఉండడం తో పదేళ్ల నుండి ఆమె విరామం లేకుండా చేస్తున్న జబర్దస్త్ షో కి గుడ్ బాయ్ చెప్పేసింది..ఇప్పుడు ఆమె స్థానం లో ఇక నుండి కమెడియన్ అలీ జడ్జి గా కొనసాగుతారు అట..దీనికోసం అలీ తో మల్లెమాల ఎంటెర్టైమెంట్స్ వారు ఒక్క అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు సమాచారం..ఇప్పటికే అలీ ఈటీవీ లో ప్రతి సోమవారం ప్రసారం అయ్యే అలీ తో సరదాగా అనే ప్రోగ్రాం చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ సెలెబ్రిటీలతో అలీ చేసే ఇంటర్వూస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది..దీనితో పాటుగా ఈటీవీ లో ప్రసారం అయ్యే యమగోల మళ్ళీ మొదలైంది అనే సీరియల్ లో కూడా అలీ నటిస్తున్నారు..ఇలా రాజకీయాల్లో బిజీ గా ఉంటేనే మరో పక్క సినిమాలు టీవీ షోలతో అలీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

    Also Read: తమిళ మూవీస్ వరుస ప్లాపుల వెనుక రీజనెంటీ?

    Tags