spot_img
Homeఎంటర్టైన్మెంట్Colors Swathi: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అంటూ స్టార్ హీరోయిన్ హాట్...

Colors Swathi: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అంటూ స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్..

Colors Swathi: యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అప్పట్లో ఝాన్సీ యాంకరింగ్ రంగం లో ఒక వెలుగు వెలిగింది , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటి గా కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఆమె పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరీర్ ని గడుపుతోంది. మరోపక్క ఉదయభాను వంటి వారు కూడా యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కొంతమేరకు సక్సెస్ ని చూసింది. అయితే యాంకరింగ్ రంగం లో సెన్సేషన్ సృష్టించిన సుమ , రష్మీ వంటి వారు యాక్టర్స్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, అనసూయ మాత్రం చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. అయితే యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అయిన ఏకైక నటి కలర్స్ స్వాతి.

అప్పట్లో జెమినీ టీవీ లో ప్రసారమైన ‘కలర్స్’ అనే టీవీ షో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, ఈ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది స్వాతి. ఆ క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె , మొదట్లో కొన్ని క్యారెక్టర్ రోల్స్ లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కలర్స్ స్వాతి, రీసెంట్ గానే ‘పంచతంత్రం’, ‘మంత్ ఆఫ్ మధు’ వంటి చిత్రాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈమధ్య కాలం లో ఈమె తన భర్త వికాస్ వాసు తో విడాకులు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె పెళ్లి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క మాటతో ఆమె తన వైవాహిక జీవితం లో ఎన్ని ఇబ్బందులను ఎదురుకుందో చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. ఈ కాలం లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే, కుక్కల్ని పెంచుకోవడం ఏంటో బెటర్, అవి ప్రేమగా , బ్రతికి ఉన్నంత కాలం మనతోనే సంతోషంగా ఉంటుంది, మోసం లాంటివి చేయడం చేత కాదు అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది స్వాతి. 2018 వ సంవత్సరంలో వికాస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది కలర్స్ స్వాతి. అప్పటికి ఆమె కెరీర్ పరంగా పీక్ రేంజ్ ఉండేది, అలాంటి కెరీర్ ని భర్త కోసం వదిలేసింది, ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా కెరీర్ ని కొనసాగించి ఉండుంటే చాలా పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండేదని అనుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version