Homeఎంటర్టైన్మెంట్CM Vijay Birthday: సీఎం విజయ్ పుట్టినరోజు.. తమిళనాడు ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

CM Vijay Birthday: సీఎం విజయ్ పుట్టినరోజు.. తమిళనాడు ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

CM Vijay Birthday: ఈ నెల 21 న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఒక పండుగ లాగా జరపబోతున్నారు. ఈ పుట్టిన రోజు విజయ్ ఫ్యాన్స్ కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు తమ ఆరాధ్య దైవాన్ని వెండితెర పై హీరోగానే చూసుకొని , పుట్టినరోజు వేడుకలను జరిపించారు , కానీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గా చూస్తూ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను జరపబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు , కేక్ కట్టింగ్స్ , సంబరాలకు సిద్ధమయ్యారు ఫ్యాన్స్. మరోపక్క ఆయన కెరీర్ లో మైలు రాళ్లుగా నిల్చిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 21 న విజయ్ ఫ్యాన్స్ జరుపుకునే పుట్టినరోజు వేడుకలు హిస్టరీ లో ఎప్పటికీ మాట్లాడుకునేలా ఉండబోతున్నాయి.

ఇది కాసేపు పక్కన పెడితే తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా బంపర్ ఆఫర్ ని ప్రకటించాడు. వందలూరు లోని అర్జిగ్నర్ అన్నా జంతుప్రదర్శనశాల, సేలం జిల్లాలోని కురంబపట్టి జంతుప్రదర్శనశాలలో ఈ సౌకర్యం అనుబాటులో ఉంటుందని రంజిత్ కుమార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఉచిత ప్రవేశం ఉండాలంటే మాత్రం , ముందుగా ఆన్లైన్ లో తమ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్ ద్వారానే టిక్కెట్స్ ని తీసుకోవాలని , ఆ టిక్కెట్స్ డబ్బు మొత్తాన్ని నా కుటుంబ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లిసానని రంజిత్ కుమార్ ప్రకటించారు. దీనిని బట్టీ ఆయనకు తన నాయకుడు , సీఎం విజయ్ పై ఏ రేంజ్ ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇలా ఉచిత ప్రవేశం కారణంగా రద్దీ భారీ గా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

వందలూరు జంతు ప్రదర్శనశాలకు సాధారణంగానే జనాలు భారీ సంఖ్యలో వస్తుంటారు. రోజుకి 15 వేలమంది వస్తారని అంచనా. అలాంటిది ఇప్పుడు ఉచితంగా ఎంట్రీ కల్పిస్తామని అంటున్నారు, అలా జరిగితే 50 వేల నుండి లక్ష వరకు సందర్శకులు ఈ జంతు ప్రదర్శన శాలకు వచ్చే అవకాశం ఉంటుందని , అలా జరిగితే అక్కడ ఉండే జంతువుల సంక్షేమం, ప్రజల భద్రతా పై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ , కేవలం 50 వేల టిక్కెట్స్ మాత్రమే ఆన్లైన్ ద్వారా ఉచితంగా అందిస్తామని , కౌంటర్ల వద్ద టిక్కెట్ల పంపిణి నియంత్రిస్తామని చెప్పుకొచ్చారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version