Buchi Babu: రీసెంట్ గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ మూవీ సృష్టించిన వసూళ్ల సునామీ ఎలాంటిదో మనమంతా కళ్లారా చూశాము. మిగతా సినిమాలకు కలిసొచ్చినట్టు , ఈ చిత్రానికి ఒక్క పండుగ , పబ్బం కూడా కలిసి రాలేదు , అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం రాబట్టిన వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రామ్ చరణ్ సినిమాకు పబ్లిక్ లో టాక్ ఉంటే, లాంగ్ రన్ ఎప్పుడు మొదలై , ఎప్పుడు ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరని, అందుకు లేటెస్ట్ ఉదాహరణ ‘పెద్ది’ నే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇప్పటికీ ఈ చిత్రం అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ ని చూసి ఎన్ని రోజులైందో. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బుచ్చి బాబు నేడు ఇండస్ట్రీ లో వేరే లెవెల్ కి వెళ్లిపోయాడని చెప్పొచ్చు.
అయితే ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండాలంటే మనస్తత్వం బుచ్చి బాబు సొంతం. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ కూడా ఆయన ముఖం ఇసుమంత గర్వం , అహంకారం కూడా లేదు. ఎప్పటి లాగానే ఒక సాధారణ మనిషిగా పిఠాపురం కి నేడు చేరుకున్నాడు. పిఠాపురం లోకి బుచ్చి బాబు అడుగుపెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ మరియు మెగా అభిమానులు ఆయన్ని ఎంతో గ్రాండ్ గా ఆహ్వానించారు. మా ఊరికి చెందిన కుర్రాడు , మా అభిమాన హీరోతో దేశం గర్వించదగ్గ సినిమా తీసాడు అనే గర్వం , బుచ్చి బాబు తో పిఠాపురం వాసులు ఫోటోలు దిగుతున్నప్పుడు వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. సినీ ఇండస్ట్రీ లో స్థిరపడినప్పటికీ , బుచ్చి బాబు కుటుంబం పిఠాపురం లోనే నివసిస్తున్నారు.
ఆయన భార్య పిల్లలు కూడా పిఠాపురం లోనే ఉంటున్నారు. ‘ఉప్పెన’ సినిమా పూర్తి అయిన వెంటనే పిఠాపురం కి వెళ్లిన బుచ్చి బాబు , పాదగయ గుడిలో ‘పెద్ది’ సినిమా స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టానని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన మూడవ సినిమా స్క్రిప్ట్ ని కూడా అదే పాదగయ గుడిలో రాయబోతున్నాడా ?, ఆయన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఉంటుందని అంటున్నారు , అందులో ఎంతవరకు నిజముంది ? , ఇలాంటి విషయాలకు సమాదానాలు దొరకాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
