నవదీప్ అంటనే కాస్త బోల్డ్.. ఉన్నది ఉన్నట్లు ఏదేదో మాట్లాడుతుంటాడు అనే నేమ్ కూడా ఉంది ఇండస్ట్రీలో అతనికి. అందకే నవదీప్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అలాగే ప్రస్తుతం కూడా నవదీప్ తనకు సంబంధం లేకపోయినా ఓ పోస్ట్ పెట్టి జగన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అసలు నవదీప్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా. జగన్ పై నాగబాబు పెట్టిన సెటైర్ పోస్ట్‌కు దగ్గరగా నవదీప్ పోస్ట్ కూడా ఉండటంతో మొత్తానికి ఈ వివాదం మొదలైంది. బొమ్మ అదిరిందిలో చేసిన ఓ స్కిట్ వల్ల మొదలైన ఈ వివాదం గురించి అందరికీ తెలిసిందే.
Also Read: గోవాలో నిహారిక బ్యాచిలర్ పార్టీ.. చూసి తీరాల్సిందే..!
ఆ స్కిట్ లో వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ హరి, రియాజ్ అనే వాళ్లు స్కిట్ చేయడంతో అది జగన్ అభిమానులను విపరీతంగా బాధ పెట్టడంతో.. చివరకు క్షమించమని వైఎస్ జగన్ అభిమానులను హరి, రియాజ్ వాళ్లు వేడుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యలో నాగబాబు సెటైర్ వేస్తూ.. ‘సింహాసనం పై కుక్కను కూర్చోబెట్టిన ఫోటోను షేర్ చేస్తూ బొమ్మ అదిరింది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. నాగబాబు పెట్టిన ఈ పోస్ట్ పైనే జగన్ అభిమానులు విరుచుకుపడ్డారు. నాగబాబును సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. కాగా ఈ వివాదం కొనసాగుతూ ఉండగా మధ్యలో నవదీప్ పెట్టిన పోస్ట్ మరింత అగ్గిని రాజేసింది.
Also Read: దిశ’ మూవీ కూడా ‘మర్డర్’ అవుతుందా?
‘కుక్కను సింహాసనం ఎక్కిస్తే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి నవదీప్ కూడా ఇలాంటి ఓ వివాదాస్పద పోస్టే పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన జగన్ అభిమానలు నవదీప్ పై పడ్డారు దీంతో దెబ్బకు దిగొచ్చిన నవదీప్ మొత్తానికి ఆ పోస్ట్ వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చాడు జగన్ గారు ఆంధ్రా సీఎం. దాని అర్థం ఆయన ఎన్నికల్లో గెలుపొందారు.. అంటే.. జనాలు ఆయన్ను ఎన్నుకున్నారు. అలాంటప్పుడు నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నా మూర్ఖత్వమే అవుతుంది.. అలా నేను మాట్లాడతానని అనుకుంటే కూడా అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఇక నాగబాబుగారు ఏం మాట్లాడారో నాకు తెలీదు..నాకంటే ముందు ఆయన ఏం ట్వీట్ చేశాడో కూడా నాకు తెలీదు అంటూ ఈ వివాదానికి సింపుల్ గా ముగింపు పలికే ప్రయత్నం అయితే చేశాడు. అయినా జగన్ ఫ్యాన్స్ వదిలేలా లేరు.
Jagan garu is andhras CM .. meaning he won the elections, meaning people who voted chose him!! Its foolish to think I was foolish enough to imply anything wrong about him.. I honestly had no idea about what babu garu tweeted before I did 🙂 so its all good, people! #letschill
— Navdeep (@pnavdeep26) October 11, 2020