బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 28 నుంచి మూడు దశల్లో ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. ఇప్పటి వరకు బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన జనతాదళ్(యు) పార్టీ నేత నితీశ్‌కుమార్ మరోసారి సీఎం క్యాండిడేట్ గా బరిలోకి నిల్చున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా ఎక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోనూ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
Also Read: భారత్ వరుస క్షిపణుల ప్రయోగాలు.. యుద్ధానికి సిద్ధమా..?
ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో ప్రచారంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. కార్యకర్తల సంఖ్యను కుదించింది. మొత్తంగా ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. దీంతో 243 స్థానాల అభ్యర్థులు సాంప్రదాయ ఎన్నికల ప్రచారాన్ని మరిచి ఆన్‌లైన్ ప్రచార బాట పట్టారు. వర్చ్‌వల్ ప్రసంగాలు.. వాట్సప్ సందేశాలు.. ట్విట్టర్ ద్వారా ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో పాగా వేసేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు ఆన్‌లైన్ ప్రాచారబాటలోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. పార్టీ తరుపున సుమారు 9500 మంది సమాచార సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. దాదాపు 72వేల వాట్సప్ గ్రూప్‌లు బీజేపీ తరుపున పనిచేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గత జూన్ 7న వర్చువల్ ప్రసంగం ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్తేజాన్ని నింపారు.
అయితే కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పటి వరకు బీజేపీతో కలిసున్న నితీశ్‌కుమార్ తాను ఒంటరిగానే గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అందుకు తగ్గ ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దీంతో పార్టీ కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. ఇక రాహుల్‌ను నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు సామాజిక మాధ్యమాల ప్రచారం ఎక్కువగా చేయడం లేదు. ఆర్జేడీ అయితే ఈ సోషల్ మీడియా ప్రచారంలో వెనుకబడింది. సంప్రదాయ ప్రచారాన్నే ఎక్కువగా నిర్వహిస్తోంది.
Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ.. జాతీయ స్థాయిలో దుమారం!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఆదివారం శివసేన పార్టీ తెలిపింది. ఏ పార్టీతో పొత్తుతో లేకుండా ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ ఎంపీ అనిల్ దేశాయ్ తెలిపారు. శివసేన ఎన్నికల గుర్తు ట్రంపెట్ ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. తమ గుర్తు ‘విల్లు బాణం’, జేడీ(యూ) ‘బాణం’ గుర్తుకు పోలికలు ఉండడంతో ఎన్నికల సంఘం అనుమతించలేదన్నారు. తమ పార్టీ బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అన్నారు. గురువారం జరిగే ప్రచారంలో 22 మంది స్టార్ క్యాంపెనర్ల జాబితాను విడుదల చేశారు.