https://oktelugu.com/

CM Jagan: స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు !

CM Jagan: జగన్ ది ఎంత గొప్ప మనసు. ముఖ్యంగా జగన్ కి సినిమా ప్రేక్షకుల శ్రేయస్సు అతి ముఖ్యం అయిపోయింది. ప్రేక్షకులు ఎక్కువ ధర పెట్టి స్టార్ హీరోల సినిమా టిక్కెట్లను కొనలేకపోతున్నారని జగన్ బాగా బెంగ పెట్టుకున్నారు. అందుకే, సినిమా టిక్కెట్ ధరల్ని అందుబాటులోకి తేవాలని తెగ ఇదైపోయి అదైపోయి మొత్తానికి ఏదొక రకంగా సినిమా టికెట్ ధరలను తగ్గించే ప్రోగ్రాంను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తున్నాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం అంటేనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 25, 2021 / 04:22 PM IST
    Follow us on

    CM Jagan: జగన్ ది ఎంత గొప్ప మనసు. ముఖ్యంగా జగన్ కి సినిమా ప్రేక్షకుల శ్రేయస్సు అతి ముఖ్యం అయిపోయింది. ప్రేక్షకులు ఎక్కువ ధర పెట్టి స్టార్ హీరోల సినిమా టిక్కెట్లను కొనలేకపోతున్నారని జగన్ బాగా బెంగ పెట్టుకున్నారు. అందుకే, సినిమా టిక్కెట్ ధరల్ని అందుబాటులోకి తేవాలని తెగ ఇదైపోయి అదైపోయి మొత్తానికి ఏదొక రకంగా సినిమా టికెట్ ధరలను తగ్గించే ప్రోగ్రాంను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తున్నాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం అంటేనే నీతికి నిజాయితీకి మారు పేరు అని ప్రజలు అనుకోవాలని జగన్ తాపత్రయం. మంచిది, జగన్ చాలా గొప్ప వ్యక్తి.

    చిన్న సినిమాకి అయినా, పెద్ద సినిమాకి అయినా ఒకటే టిక్కెట్ ధర పెట్టేంత గొప్ప వ్యక్తి. అంతేనా, పిచ్చి మందులను అర్ధరాత్రి బ్లాక్ లో అమ్ముకునేలా తన వాళ్లకు సపోర్ట్ గా నిలబడిన మహోన్నత నేత జగన్. కానీ అదనంగా షోలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వడు. మరి అదనంగా షోలు వేస్తే అర్ధరాత్రి సినిమాకు వెళ్లి ప్రజలు ఇబ్బంది పడితే ఎలా ?

    తన రాజ్యంలో తన ఇష్టప్రకారమే జరగాలి, తానే గొప్ప వ్యక్తిగా, అందరూ అభిమానించే వ్యక్తిగా తాను మాత్రమే ఉండాలి గానీ మధ్యలో ఈ సినిమా వాళ్ళు ఎవరు ? అసలు మొహానికి రంగు వేసుకునే వాళ్లకు రాజకీయాలు ఎందుకు ? ఇది జగన్ గారి మనసులోని అంతరంగాలు. అంతేనా.. అసలు జగన్ గారి ఆలోచనలు మరో ఏ నేతకు ఉండవు. సరే జగన్ గారి నిర్ణయాలను మనం ఇప్పుడు కొత్తగా ఎంత చర్చించుకున్నా ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి.. జగన్ బాబు వ్యవహారాలను పక్కన పెట్టేద్దాం.

    ముందు సినీ ప్రేక్షకుల పై టిక్కెట్ల భారం నిజమేనా ? నిజంగానే టికెట్ బాగోతాలతో ప్రజలు బాగా విసిగిపోయారా ? ఒక్కటి మాత్రం నిజం.. పెద్ద సినిమాల పేరు చెప్పి అడ్డంగా దోచేస్తున్నారు. ఎవరు దోచేస్తున్నారు ? థియేటర్ల యాజమాన్యాలా ? లేక నిర్మాతలా ? లేకపోతే మధ్యలో ఉండే బయ్యర్లా ? ఎవరు దోచుకుంటున్నారు ? అయినా ఈ దోపిడీ అనేది ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది.

    Also Read: Shyam Singaroy: భారీ లెవెల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్…

    పెద్ద సినిమా తొలి రోజు టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు ఎప్పటినుంచో అనుమతి ఉంది కదా. మరి జగన్ ఎందుకు ఈ కొత్త చట్టాలు తెస్తున్నాడు ? పిచ్చి మందుకు కూడా వందల రూపాయలు వసూళ్లు చేస్తోన్న జగన్.. సినిమాలకు మాత్రం ఎందుకు ఈ ప్రత్యేక తగ్గింపు ధరలు పెడుతున్నాడు. ఏది ఏమైనా పెద్ద సినిమాలకు, స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు. తెలుగు సినిమాకు పీడకలను మిగిల్చాడు.

    Also Read: Akhanda: సింపుల్​గా ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్​.. బాలయ్య బాబే కారణం?

    Tags