Singer Mangli- CM Jagan: ఏపీ సీఎం జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు రాజకీయంగా పలు పదవులను కట్టబెడుతున్నారు. మొన్న ప్రముఖ నటడు ఆలీ, నిన్న పోసాని కృష్ణ మురళికి కీలక బాధ్యతలు అప్పగించాడు. తాజాగా సింగర్ మంగ్లీని ఎస్వీబీసీలో సలహాదారుగా నియమించారు. సినీ ఇండస్ట్రీని అక్కున చేర్చకునేందుకు జగన్ వేస్తున్న ప్రణాళికలో భాగంగానే కొందరికి పదవులను ఇస్తున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల రేట్లు, తదితర కారణాలతో కొంత కాలంగా ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ ఇండస్ట్రీకి కాస్త నిరాశే ఉంది. దీనిని పొగొట్టేందుకు చిత్ర పరిశ్రమను ఆదరిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా అటు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని దెబ్బకొట్టేందుకు సైతం ఈ వ్యూహం రచిస్తున్నాడని తెలుస్తోంది.

కొంత కాలంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. విశాఖ ప్రజావాణి నుంచి పవన్ సీరియస్ గా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దీంతో పవన్ పార్టీపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే టీడీపీ, బీజేపీలు పవన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎలాగైనా కలిసి నడవాలని నిర్ణయించారు. జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు జనాలు సైతం ఇంప్రెస్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ ను ఎదుర్కొనేందుకు జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు సంబంధం ఉన్న సినీ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టారు. ఏపీలో టిక్కెట్ల రేట్ల నిర్ణయంపై చాలా మంది సినీ రంగానికి చెందిన వారు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే వారికి చేరదీసినట్లవుతుందని భావిస్తున్నారు. దీంతో ప్రముఖ నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఆ తరువాత ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

తాజాగా సింగర్ మంగ్లీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సలహాదారుగా కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రైవేట్ అల్బమ్ తో పాపులర్ అయిన మంగ్లీ సినీ గేయాలు ఆలపిస్తోంది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన గురించి కొన్ని పాటలు పాడింది. ఆ పాటలు సూపర్ హిట్ సాధించాయి. వీటిలో తూరుపు దిక్కున భానుడు లేచే.. అనేసాంగ్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అప్పటి నుంచే తమ ప్రభుత్వం వస్తే మంగ్లీకి ఏదో ఒక పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్ల సమాచారం.
ఇప్పుడు సార్వ్రతిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పాటు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న విమర్శలను ఆపేందుకు మంగ్లీకి పదవిని ఇస్తే రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుందని భావించారు. అయితే పవన్ కల్యాణ్ కు సినీ రంగంతో పాటు రాజకీయంగా చాలా మంది సపోర్టు చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి సైతం పవన్ గొప్ప నాయకుడు అవుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చిత్ర పరిశ్రమ ఇటు పవన్ వైపు ఉంటుందా..? లేక వైసీపీ కి మద్దతు ఇస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. మరో వైపు సినీ రంగంలోకి మరెవరికి పదవులు వస్తాయోనని కొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.