Classic Telugu Movies of Star Heroes : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మంచి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకున్నప్పటికి అవి సక్సెస్ లను మాత్రం సాధించవు. కల్ట్ క్లాసికల్ గా మిగిలిపోతూ ఉంటాయి. ఇక అలాంటి వాటిలో మన హీరోలు చేసిన సినిమాల్లో ఏ సినిమా కల్ట్ క్లాసికల్ సినిమాలు గా మిగిలిపోయాయి అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వచ్చిన జానీ (Johnny) సినిమా ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్ చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ సినిమాను చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపించడం విశేషం… ఆ రకంగా ఈ సినిమా క్లాసికల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయిందనే చెప్పాలి…
Also Read : త్రివిక్రమ్ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ పేరేంటి ఇంత విచిత్రం గా ఉంది..?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సినిమా సక్సెస్ ని సాధించినప్పటికి భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాని క్లాసికల్ సినిమాగా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు…
మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వచ్చిన ఖలేజా (Khaleja) సినిమా థియేటర్లో ఫ్లాప్ అయినప్పటికి ఈ సినిమాను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల్లో గొప్ప రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. మొత్తానికైతే ఈ సినిమా క్లాసికల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఈ సినిమా రీరిలీజ్ అవ్వడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం…
ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన సాహో(Sahoo) సినిమా తెలుగులో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి ఈ సినిమాకి తెలుగులో అంత పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చాలా బాగుంటుందంటూ ప్రేక్షకులందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేసినా కూడా భారీగా సక్సెస్ చేస్తామంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. మొత్తానికైతే ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా ఒక క్లాసికల్ సినిమాగా మిగిలిపోయిందనే చెప్పాలి…
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో వచ్చిన ఆరెంజ్ (orange) సినిమా అప్పట్లో పెను సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ని సాధించకపోయిన కూడా రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉండడంతో మెగా అభిమానులకు బాగా నచ్చేసింది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మారింది. కొద్దిరోజుల క్రితం రీ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మొత్తానికైతే ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం (Vedam) సినిమా భారీ అంచనాలతో వచ్చి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినప్పటికి ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా అయితే బాగా నచ్చింది. ఇక ఇప్పటికి ఈ సినిమా గురించి చాలాసార్లు ప్రస్తావన వస్తూనే ఉంటుంది…