Mahesh Babu- Gautham Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా ఫ్రేమ్ కి ఫోమ్ ఎఫెక్ట్ లో కలర్స్ అద్దిన ఘనత గౌతమ్ మీనన్ సొంతం. ఇండియన్ క్లాసిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉండే అర్హత కలిగిన నేటి మేటి దర్శకుడు గౌతమ్ మీనన్. చూడటానికి అమ్మాయికుడిలా చాలా రఫ్ గా కనిపించినా.. సినిమా తీయడంలో గౌతమ్ మీనన్ తోపు. ఒక లెజెండరీ డైరెక్టర్ గా కూడా గౌతమ్ మీనన్ ను హీరోలు గుర్తిస్తారు.
గౌతమ్ మీనన్ రొమాంటిక్ మూడ్ కి కూడా ఎమోషన్ రుచి చూపించగలిగిన గ్రేట్ విజువల్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ తీసిన లవ్ స్టోరీలు, ఆయన ఇచ్చిన గొప్ప సినిమా అనుభూతి ఈ జనరేషన్ లో మరో డైరెక్టర్ ఇవ్వలేదు అంటే అది అతిశయోక్తి అయితే కచ్చితంగా కాదు. అందుకే గౌతమ్ మీనన్ అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వారు కూడా కథ వినకుండానే డేట్లు ఇస్తారు,
Also Read: Twitter Elon Musk Deal: ట్విట్టర్ కి హ్యాండిచ్చిన ఎలన్ మాస్క్!
కాకపోతే, మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం గౌతమ్ మీనన్ తో సినిమా చేసే ఛాన్స్ ను గత ఏడేళ్లుగా పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వస్తున్నాడు. కారణం ఒక్కటే… తన మార్కెట్ రేంజ్ లో గౌతమ్ మీనన్ సినిమా తీస్తాడా లేదా అని మహేష్ కి డౌట్. నిజానికి గౌతమ్ మీనన్ క్లాసిక్ చిత్రాల ఫేవరేట్ డైరెక్టర్ గా మంచి నేమ్ తెచ్చుకున్నా.. గౌతమ్ మీనన్ లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే స్కిల్స్ పెద్దగా లేవు అని టాక్ ఉంది.
కాకపోతే ప్రస్తుతం గౌతమ్ మీనన్ గొప్పతనం అంతా గతం అన్నట్టు ఉంది పరిస్థితి. రియలిస్టిక్ ఎమోషన్స్ తో సినిమాలు చేయడం అలవాటుగా చేసుకున్న గౌతమ్ మీనన్ నేటి కుర్రాళ్ళు పల్స్ పట్టుకోలేకపోతున్నాడు. అందుకే మహేష్ డేట్స్ ఇవ్వడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఈ లోపు ఏదొక సినిమా కమిట్ అవుతూ అలా నెట్టుకొస్తున్నాడు.
అయితే గౌతమ్ మీనన్ తాజాగా తన కొత్త సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ‘గతంలో నేను మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నించాను. కానీ అది అప్పుడు వర్కౌట్ కాలేదు. అయితే మంచి కథ దొరికితే ఇప్పటికీ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉంది’ అంటూ గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి మహేష్ కోసం తాను ఎంతగా తపిస్తున్నాడో గౌతమ్ మీనన్ డైరెక్ట్ గానే చెప్పుకొచ్చాడు.
Also Read:Anasuya Bharadwaj: బుల్లితెరకు బైబై.. వెండితెరకే అనసూయ ప్రాధాన్యం!