https://oktelugu.com/

Naresh Pavitra Lokesh Marriage: అవును, ఆ విధంగా మాకు పెళ్లైపోయింది.. ఓపెన్ గా చెప్పేసిన నరేష్!

మీరు పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారా? లేదా? ఒకవేళ చేసుకోకుంటే భవిష్యత్ లో చేసుకునే ఆలోచన ఉందా? అని అడిగారు. దీనికి నరేష్ పరోక్షంగా సమాధానం చెప్పాడు. వివాహ వ్యవస్థ పాడైపోయింది.

Written By:
  • Shiva
  • , Updated On : May 11, 2023 / 06:45 PM IST

    Naresh Pavitra Lokesh Marriage

    Follow us on

    Naresh Pavitra Lokesh Marriage: నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. మే 26న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. మళ్ళీ పెళ్లి ట్రైలర్ నరేష్ నిజ జీవితంలో చోటు చేసుకున్న కాంట్రవర్సీల సమాహారంగా చాలా స్పైసీగా ఉంది. నరేష్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్ గా ఉంది. నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. ట్రైలర్ విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు పాత్రికేయుల నుండి ఓ సీరియస్ క్వశ్చన్ ఎదురైంది.

    మీరు పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారా? లేదా? ఒకవేళ చేసుకోకుంటే భవిష్యత్ లో చేసుకునే ఆలోచన ఉందా? అని అడిగారు. దీనికి నరేష్ పరోక్షంగా సమాధానం చెప్పాడు. వివాహ వ్యవస్థ పాడైపోయింది. అందుకే చాలా జంటలు విడాకులు కోరుకుంటున్నారు. కాబట్టే ఫ్యామిలీ కోర్టులు ఎక్కువైపోయాయి. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం. ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడటం అన్నారు.

    పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుంది లేనిదే నరేష్ చెప్పలేదు. అయితే పెళ్ళికి అర్థం ఒకరినొకరు ఇష్టపడటం కాబట్టి మాకు పెళ్ళైపోయినట్లే అని చెప్పారు. నేను ఆమెకు తాళి కట్టకపోయినా మా హృదయాలు కలిశాయి. మేము సహజీవనం చేస్తున్నాము. ప్రత్యేకంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది. పెళ్లి అనేది కలిసి జీవించడానికి లైసెన్స్ మాత్రమే. ఇష్టం అనేది ప్రధానం. అది మాకు ఒకరిపై మరొకరికి ఉందని నరేష్ పరోక్షంగా చెప్పారు. కాబట్టి నరేష్ కి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకునే ఆలోచన లేదు. కానీ ఆమె తనకు భార్యతో సమానం.

    పవిత్ర లోకేష్ మెడలో నరేష్ తాళి కట్టకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. మూడో భార్య రమ్య రఘుపతితో ఆయనకు విడాకులు కాలేదు. భార్య ఉండగా మరొక మహిళను వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. రమ్యతో నరేష్ విడిపోయినప్పటికీ పెళ్లి చేసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి. అందుకే నరేష్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఆమెను పెళ్లి చేసుకున్నా ఆ విషయాన్ని నరేష్ బయటపెట్టరు.