https://oktelugu.com/

బిగ్‌బాస్‌4 నుంచి ఆఫర్ వచ్చింది: స్టార్ కొరియోగ్రాఫర్

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లలో మంచి పేరున్న వ్యక్తి రఘు మాస్టర్. ‘ఢీ’ షోలో తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని సినిమాల్లోకి వచ్చాడు. ‘ఆర్య’ మూవీలో ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ అనే సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన రఘు అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి పలు హిట్‌ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చిన అతను.. పలువురు స్టార్ హీరోలతో పని చేశాడు. కొన్ని టీవీ షోస్‌లో జడ్జ్‌గా వ్యవహరించడంతో పాటు మూవీస్‌లో కూడా యాక్ట్‌ చేసిన రఘు ఇప్పుడు ఓ రియాలిటీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 03:39 PM IST
    Follow us on


    టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లలో మంచి పేరున్న వ్యక్తి రఘు మాస్టర్. ‘ఢీ’ షోలో తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని సినిమాల్లోకి వచ్చాడు. ‘ఆర్య’ మూవీలో ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ అనే సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన రఘు అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి పలు హిట్‌ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చిన అతను.. పలువురు స్టార్ హీరోలతో పని చేశాడు. కొన్ని టీవీ షోస్‌లో జడ్జ్‌గా వ్యవహరించడంతో పాటు మూవీస్‌లో కూడా యాక్ట్‌ చేసిన రఘు ఇప్పుడు ఓ రియాలిటీ షోలో ఎంటర్ కాబోతున్నాడు. తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టంట్‌గా అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని రఘునే వెల్లడించాడు. బిగ్‌బాస్‌ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని షోలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు.

    Also Read: బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?

    ‘అవును, బిగ్‌బాస్‌4 వాళ్లు నన్ను సంప్రదించారు. ఇంతకుముందు సీజన్లప్పుడు కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ టైమ్‌లో ఇతర షూటింగ్స్‌తో బిజీగా ఉండడంతో చేయలేకపోయా. అయితే, ఆ సారి మాత్రం ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోవాలని అనుకోవడం లేదు. బిగ్‌ బాస్‌లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నా. కరోనా టైమ్‌లో స్టార్ట్‌ అవుతున్న ఈ షోలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తరచూ టెస్టులు చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. కంటెస్టంట్స్‌ ఆరోగ్యం విషయంలో మేనేజ్‌మెంట్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. లాక్‌డౌన్‌ తర్వాత నేను కొన్ని షూటింగ్స్‌లో పాల్గొన్నా. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్స్‌ పూర్తి చేశాం. మరింత కాలం మనం ఇంట్లోనే బంధీగా ఉండలేం. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కొత్త లైఫ్‌ను స్టార్ట్‌ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షోలో కొన్ని మార్పులు ఉంటాయి. అలాగే, సవాళ్లూ ఎదురవుతాయని నాకు తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు ఆత్రుతగా ఉన్నా’ అని ఓ ఇంటర్వ్యూలో రఘు పేర్కొన్నాడు.

    Also Read: నా కొత్త మూవీ టైటిల్ ని‌ గెస్‌ చేయండి: ఆదా శర్మ

    బిగ్‌బాస్‌ షో ఫార్మాట్‌ గురించి తనకు అవగాహన ఉందని, కచ్చితంగా ఫైనల్‌కు వెళ్లగలనన్న నమ్మకం ఉందన్నాడు రఘు. షోలో పాల్గొనే అందరి లక్ష్యం అదే అయినా.. తాను మాత్రం ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా కూల్‌గా, పాజిటివ్‌గా ముందుకెళ్తానని చెప్పాడు. ఈ షో ద్వారా మన గురించి మనం తెలుసుకునే అవకాశం లభిస్తుందని, అవసరమైన టైమ్‌లో తన వాదనను బలంగా వినిపిస్తానని రఘు అంటున్నాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండేది కొత్త స్నేహితులను ఏర్పరుచుకోవడానికో, వారితో అనుబంధం పెంచుకోవడానికో కాదన్నాడు. ఆ రోజు ఇచ్చిన గేమ్‌పైనే ఫోకస్‌ పెడుతానని.. ఈ విషయంలో సెకండ్ సీజన్‌ విన్నర్ కౌశల్‌ గేమ్‌ ప్లాన్‌కు తాను సపోర్ట్‌ ఇస్తానని స్పష్టం చేసిన రఘు బిగ్‌బాస్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యాడని తెలుస్తోంది. లాస్ట్‌ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసిన తమిళ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఎంటర్టైన్‌ చేశాడు. మరి, ఈసారి రఘు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం.

    Tags