Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి నిధి తప్పుకుందా?

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి నిధి తప్పుకుందా?

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ హరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం భీమ్లానాయక్​. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన అయ్యప్పనుమ్​ కోశియుమ్​ సినిమాకు రీమేక్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. థమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు పవన్​. అదే హరిహర వీరమల్లు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసుకుంది.

మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది.  కాగా, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్​ న్యూస్​ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హీరోయిన్​ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లానాయక్​.. ప్రస్తుతం ప్రమోషన్స్​ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్​లు సినిమాపై భారీగా అంచనాలు రేకెత్తించాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్  నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version