Cinema Viral : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. భారతరత్న లతా మంగేష్కర్ మృతిపట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ అసాధారణ జీవితాన్ని గడిపారని.. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’ మూవీ ఈ నెల 11న డైరెక్ట్‌గా జీ5లో విడుదల కానుంది. భార్యతో విడాకులు తీసుకోవాలనుకున్న యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణి, న్యాయవాది పాత్రలో హీరోయిన్‌గా నైనా గంగూలీ నటించారు. ఈ చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు.
Also Read: అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన మొదటి నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల వివరాలివే.. రెడ్ నోటీస్(129), ఎక్స్‌ట్రాక్షన్(99), బర్డ్‌బాక్స్(89), స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్(85), 6అండర్‌గ్రౌండ్(83), మర్డర్ మిస్టరీ(83), ది ఓల్డ్ గార్డ్(78), ఎనోలా హోమ్స్(76), ప్రాజెక్ట్ పవర్(75), ఆర్మీ ఆఫ్ ది డెడ్(75). ఏది ఏమైనా కరోనా కాలంలో సినిమాలకు ఊపిరి పోసింది ఓటీటీ సంస్థలే. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు.
[…] Kalyan Dev: మెగా డాటర్ శ్రీజను పెళ్లి చేసుకుని, ఆమెతో కలిసి ఒక పాపకు కూడా జన్మను ఇచ్చి.. ప్రసుతం ఆమెకు దూరంగా ఉంటున్నాడు శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్. ఇప్పటికే శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే, ఇంతవరకు వీళ్లిద్దరూ అధికారికంగా ఈ వార్త పై స్పందించలేదు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది అటు మెగా ఫ్యామిలీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. […]