https://oktelugu.com/

సినీ లోకం నిండా కన్నీళ్లు కష్టాలే !

ఎక్కడో పుట్టి మొత్తం మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా సర్దుకుపోవాల్సిన స్థితి ఒక్క కరోనాతో సాధ్యం అయిందనుకుంటా. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నా.. అందరికీ సాయం అందించలేని పరిస్థితి. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది.. షూటింగ్లు జరపకుండా ఇంకా పంజా ఎప్పుడు విసురుదామా అని కాచుకుని కూర్చుంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్స్‌ అన్ని మూసేశారు.. ఇటివలే మొదలెట్టిన సినిమాల షూటింగ్ […]

Written By: , Updated On : June 30, 2020 / 07:56 PM IST
Follow us on


ఎక్కడో పుట్టి మొత్తం మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా సర్దుకుపోవాల్సిన స్థితి ఒక్క కరోనాతో సాధ్యం అయిందనుకుంటా. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నా.. అందరికీ సాయం అందించలేని పరిస్థితి. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది.. షూటింగ్లు జరపకుండా ఇంకా పంజా ఎప్పుడు విసురుదామా అని కాచుకుని కూర్చుంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్స్‌ అన్ని మూసేశారు.. ఇటివలే మొదలెట్టిన సినిమాల షూటింగ్ లన్నీ ఆపేశారు. మరోపక్క కృష్ణ నగర్ కష్టాలు సినిమా పక్షుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.. మరో రెండు నెలలు షూటింగ్ లు లేకపోతే.. సినీ కార్మికులు కడుపు నింపుకోవడం కష్టమే.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

మరి ఏం చేయాలి ? సినిమానే నమ్ముకుని బతుకుతున్న వారికి మరో పని రాదు, సరే నేర్చుకుని చేద్దామన్నా ఇప్పటికిప్పుడు పని ఇచ్చే వాడు ఎవడు ? సినిమా జీవులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేదు. పోనీ రెండు నెలలు కష్ట పడదాం అని సర్దిచెప్పుకున్నా… ఆ తరువాత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. పైగా ఇప్పటికే చిన్న సినిమాల్లో తమ డబ్బులు ఖర్చు పెట్టిన చిన్న నిర్మాతలకు ఏం అంతుచిక్కట్లేదు. ఇక జూనియర్ ఆర్టిస్ట్ లు అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. మళ్ళీ పెద్ద సినిమాల షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో… మొదలైనా అందరికీ పని దొరుకుతుందో లేదో.. అని సినీ కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

ఆ నరకం నుండి వారిని ఆదుకునేది ఎవరు? కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేస్తోన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవట. ఎదో ఆ మధ్య మంత్రి శ్రీనివాస్ యాదవ్ నాలుగు కిలోలు రైస్ ఇచ్చాడని.. అంతకుమించి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సినీ కార్మికులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తమ పథకాలను వర్తింపు చేయాలి. సినిమా పరిశ్రమ పై కెసిఆర్ ప్రభుత్వం కరుణ చూపించాలని కోరుకుందాం.