బాబుకి ఆయుధంగా మారుతున్న వైజాగ్ ప్రమాదాలు..!

సీఎం వై ఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా మార్చాలని పట్టుదలతో ముందుకు వెళుతున్న వేళ, వరుస ప్రమాదాలు ఆయన నిర్ణయాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చిననాటి నుండి టీడీపీ ప్రభుత్వం జగన్ కి వ్యతిరేకంగా ఓ యుద్ధమే చేస్తుంది. మూడు రాజధానులు వద్దు ఒక్కటే ముద్దు అంటూ…వారు అమరావతిని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం జగన్ ని రెండు ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుండగా, అమరావతి మాత్రమే […]

Written By: Neelambaram, Updated On : June 30, 2020 8:15 pm
Follow us on


సీఎం వై ఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా మార్చాలని పట్టుదలతో ముందుకు వెళుతున్న వేళ, వరుస ప్రమాదాలు ఆయన నిర్ణయాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చిననాటి నుండి టీడీపీ ప్రభుత్వం జగన్ కి వ్యతిరేకంగా ఓ యుద్ధమే చేస్తుంది. మూడు రాజధానులు వద్దు ఒక్కటే ముద్దు అంటూ…వారు అమరావతిని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం జగన్ ని రెండు ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుండగా, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని బాబు ఒక పక్షాన నిలిచి పెద్ద సాహసం చేశారు. బాబు అమరావతి పోరాటం ప్రభావం ఆ మధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రజలు చూపించారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ఆయన పట్ల నిరసన వ్యక్తం చేశారు. అది వైసీపీ గుండాల చర్య అని బాబు సమర్ధించుకున్నా…వారి ప్రయోజనానికి అడ్డుపడే వారిని ఎవరు మాత్రం సమర్థిస్తారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

ఇదిలా ఉంటే మే 7వ తేదీన వైజాగ్ ఆర్ ఆర్ వెంకటాపురం గ్యాస్ లీకేజ్ ఘటన వైజాగ్ రాజధాని నిర్ణయంపై తీవ్ర ప్రభావము చూపింది. ఎల్ జి పాలిమర్స్ నుండి విడుదలైన విషవాయువు 11 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంది. 1000 మందికి పైగా ఈ విష వాయువు బారిన పడ్డారు. జగన్ బాధితులకు భారీ పరిహారం చెల్లించి వారి నోళ్లు మూయించారని ప్రతి పక్షాలు గగ్గోలు పెట్టాయి. రాజధానిగా వైజాగ్ శ్రేయస్కరం కాదని వారు ఈ సంఘటన ఉదాహరణగా చూపుతూ.. అమరావతి సెంటిమెంట్ ని బలపరిచే ప్రయత్నం చేశారు. అమరావతిలో జరిగిన అవినీతి బయటికి తీయాలనే ప్రయత్నంలో ఉన్న జగన్, ఆ దిశగా అడుగులు వేస్తూ…తన మూడు రాజధానుల నిర్ణయం సమర్ధించుకోవడమే కాకుండా వైజాగ్ నుండి పాలన సాగించడానికి పావులు కదుపుతున్నాడు.

ఇది ఓటు బ్యాంకు రాజకీయం కదా పవన్?

కాగా నేడు జరిగిన మరో సంఘటన టీడీపీ నాయకులకు ఆయుధంగా మారింది. పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ కెమికల్స్ నుండి గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరొక నలుగురు తీవ్ర అస్వస్థకి గురి అయ్యారు. దీనితో గత నెలలో జరిగిన విషాదాన్ని కూడా లేవనెత్తుతూ టీడీపీ నేతలు విమర్శలకు దిగారు. ఇద్దరు కార్మికుల చావును పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. వైజాగ్ నగరం రాజధానిగా అంత అనువైనది కాదనే అభిప్రాయం ప్రజల్లో కలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శాసన మండలితో సహాయంతో జగన్ నిర్ణయాలను ముందుకు వెళ్లకుండా బాబు చేస్తుండగా…వరుస ప్రమాదాలు మరిన్ని తలనొప్పులు తీసుకువస్తున్నాయి.