Chiranjeevi Vishwambhara: చిరంజీవి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్లిన హీరోల్లో చిరంజీవి టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టార్ హీరోగా నిల్చోబెట్టాయి. 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి విశ్వంభర సినిమాతో ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ గతంలో కొన్ని కామెంట్స్ చేశాడు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదట. ఆగస్టులో గాని లేదంటే సెప్టెంబర్ లో గాని ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయి సంవత్సరం దాటినా కూడా ఇప్పటివరకు సినిమాని రిలీజ్ చేయకపోవడం గల కారణం ఏంటంటే సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉందట. అది అనుకున్న రేంజ్ లో రాలేదట. దానివల్ల ఇంకొక కంపెనీతో సీజీ వర్క్ మొత్తాన్ని మొదటి నుంచి చేయించారు. అయినప్పటికి వాళ్లు కూడా అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయకపోవడంతో సినిమాని రిలీజ్ చేసే విషయంలో మేకర్స్ చాలా వరకు ఆందోళన చెందుతున్నారు.
చిరంజీవి సైతం ఈ సినిమా రిలీజ్ లో చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమా మీద కన్విన్స్ అవ్వడం లేదట. ఏది ఏమైనా కూడా సినిమాని పోస్ట్ పోన్ చేసే కొద్ది ప్రొడ్యూసర్ భారీ నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఎప్పుడు రిలీజ్ చేసిన కూడా సినిమా సక్సెస్ సాధిస్తే సాధించవచ్చు లేకపోతే ప్లాప్ అవ్వచ్చు…
కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుత ఈ సినిమా మీద దాదాపు 250 కోట్లకు పైన బడ్జెట్ కేటాయించారు. ఇక చిరంజీవికి ఉన్న మార్కెట్ ను బట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా 300 నుంచి 350 కోట్ల వరకు కలెక్షన్స్ మాత్రమే వస్తాయి.
ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఫైనాన్సర్లకు వడ్డీతో ఇవ్వాల్సిన మనీ ని కనక చూసుకున్నట్లయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని చాలామంది చెబుతున్నారు. ఇక ఈ విషయంలో చిరంజీవి ఎలా స్పందిస్తాడు…సినిమా రిలీజ్ ఎప్పుడు చేస్తారు అనే దాని మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది…