
పదేళ్ల విరామం తరవాత హీరో గా వెనక్కి వచ్చినప్పటికీ తన నంబర్ వన్ స్థానం చెక్కు చెదరలేదని నిరూపించు కొన్న చిరంజీవి తన సినీ జర్నీలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఆ క్రమంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించు కొంటున్నాడు . పాత దర్శకులను పక్కన పెట్టి యువ దర్శకులకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన `సైరా`చిత్రం తో యువ దర్శకుడు సురేందర్ రెడ్డి కి అద్భుత అవకాశం ఇచ్చిన చిరంజీవి తను నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’ద్వారా దర్శకుడు కొరటాల శివ కి మంచి అవకాశం కల్పించాడు. అంతేకాదు ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించ బోయే చిత్రాలన్నీ యువ దర్శకులతోనే ఉంటాయంటూ స్వయంగా తెలపడం జరిగింది .
వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని
ఆ క్రమంలో ‘సాహో’ ఫేమ్ సుజిత్ తో మళయాళ రీమేక్ ‘లూసిఫర్’ చేసే ఆలోచన లో వున్నాడు. ఇక ఆ తరవాత సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ తో , కజిన్ బ్రదర్ మెహర్ రమేశ్ లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నా అని తెలిపారు .ఇంకా యువ దర్శకుల్లో గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్, రంగస్థలం ఫేమ్ సుకుమార్, గీత గోవిందం ఫేమ్ పరశురామ్ లను తన ఇంట్లోనే ఇటీవల కలిస్ సినిమా చేసే విషయం లో చర్చలు కూడా జరిగాయి అని చెప్పారు. కొరటాల చిత్రం పూర్తయిన తర్వాత తన కొత్త ప్రాజెక్టు ఎవరితో చేస్తానని విషయం గురించి వివరాలు చెబుతానని చిరంజీవి అన్నారు.
యువ దర్శకులతో పని చేస్తే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని తెలిపారు . ‘నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి , డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్ కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది’ అని తెలిపారు .. అలాగే ` తనకు కూడా కొత్త దర్శకులతో , వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం స్ఫూర్తి దాయకంగా ఉంటుంది `అని చిరంజీవి చెప్పారు.