
కేవలం వన్ ఇయర్ గ్యాప్ లో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలు సాధించిన ఘనుడు మెగా స్టార్ చిరంజీవి. చాలా మందికి వరుస విజయాలు ఉన్నాయి గాని , చిరంజీవిలా ఒక సంవత్సరం గ్యాప్ లో 2 ఇండస్ట్రీ హిట్ సినిమాలు లేవు .
వైజయంతి మూవీస్ బ్యానర్ కి చిరంజీవికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు .ఆ బ్యానర్లో చిరంజీవి నాలుగు సినిమాల్లో నటిస్తే మూడు అల్ టైం హిట్స్ కాగా ఒకటి మాత్రం జస్ట్ హిట్ అయ్యింది. “జగదేక వీరుడు అతిలోక సుందరి , చూడాలని ఉంది , ఇంద్ర , జై చిరంజీవ ” వంటి నాలుగు చిత్రాల్లో చిరంజీవి నటిస్తే మొదటి మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. నాలుగో చిత్రం ‘జై చిరంజీవి `మాత్రం మామూలు సక్సెస్ సాధించింది. ఇక 1990 మే 9 వ తారీఖున వచ్చిన `జగదేకవీరుడు అతిలోకసుందరి `చిత్రం చిరంజీవి కెరీర్ లో ఒక మరపురాని చిత్రం అని చెప్పక తప్పదు. 29 కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం , అనేక ఇతరకేంద్రాల్లో షిఫ్తుల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది .కాగా ఈ చిత్రం విజయవాడ అప్సర థియేటర్ లో డైరెక్టుగా 200 రోజులు ప్రదర్శింపబడి నేటికీ రికార్డు గా నిలిచింది.


బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?
`జగదేకవీరుడు అతిలోక సుందరి ` విడుదల అయిన సంవత్సరానికి 1991 మే 9 వ తారీఖున విడుదల అయిన శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ వారి ” గ్యాంగ్ లీడర్ ” చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది . మొత్తం 55 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ` గ్యాంగ్ లీడర్` చిత్రం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో 162 రోజులు ప్రదర్శింప బడి నేటికీ ఒక రికార్డుగా నిలిచింది .
అలా రెండు చిరంజీవి సినిమాలు ఒక సంవత్సరం గ్యాప్ లో ” మే 9 ” తేదీన విడుదలై ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నేటికీ నిలిచి పోయాయి .

