స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుస సినిమాలతో ఎపుడూ బిజీగా ఉంటాడు. ఆ క్రమంలో ఇపుడు దిల్ రాజు నిర్మాణం లో మూడు సినిమాల రూపొందుతున్నాయి. అందులో మొదటిది అయిన ” వి ” చిత్రం నాని హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన మూవీ. .కాగా ఇందులో మహేష్ బాబు బావ సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటించడం జరిగింది. నిజానికి ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఈ పాటికి థియేటర్ లలోకి రావాల్సింది . కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిపడింది. ఇక ఈ చిత్రం తరవాత పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ ” కూడా దిల్ రాజు నిర్మాణంలో రూపొందినదే. ఈ సినిమా షూటింగ్ సైతం చివరి దశకు చేరుకుంది. కేవలం ఒక వారం , పది రోజుల పని మాత్రమే పెండింగ్ లో వుంది .ఇక మూడో చిత్రం దర్శకుడు వి .వి వినాయక్ హీరోగా ” శీనయ్య ” పేరుతొ తెరకెక్క బోతోంది .
బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?
ఇవన్నీ ఒకెత్తు అయితే దిల్ రాజు దగ్గర ఓ భారీ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఒకటి ఉందని తెలుస్తోంది .దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఆ స్క్రిప్ట్ పూర్తి చేసి దర్శకత్వం చేసేందుకు రెడీ గా ఉన్నాడు అని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో కధకు తగ్గ స్టార్ హీరో కోసం నిర్మాత , దర్శకుడు ఎదురు చూస్తున్నారట…ఇక దీనితో పాటు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్ ” అనే మూవీ చేయడానికి కూడా దిల్ రాజు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Producer dil raju plans pan india film
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com