https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ సినిమాకి చిరంజీవి ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఏం పని చేయలేదా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2025 / 03:17 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక మన హీరోలు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది…

    రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. మరి ఈ సినిమాను చూసిన చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని తెరకెక్కించిన విధానం అయితే మాకు నచ్చలేదు అంటూ మొహం మీదే చెప్పేస్తున్నారు. కారణం ఏదైనా కూడా మూడు సంవత్సరాల పాటు రామ్ చరణ్ ఏ సినిమాకి కూడా తన డేట్స్ ని కేటాయించకుండా కేవలం ‘గేమ్ చేంజర్’ సినిమా మీదనే తన డేట్స్ ని కేటాయిస్తూ వచ్చాడు. మరి ఎందుకని ఈ సినిమా అంత మంచి విజయాన్ని సాధించలేకపోయింది అంటే దానికి మొత్తం కారణం శంకర్ అనే చెబుతున్నారు. మరి ఈ సినిమాని గత వారం రోజుల క్రితమే చిరంజీవి చూసి అందులో కొన్ని సజెషన్స్ అయితే చెప్పాడు. మరి చిరంజీవి చెప్పిన సజెషన్స్ ప్రకారం కొన్ని సీన్స్ ను కట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఆయన ఏదైతే చెప్పాడో ఆ సీన్స్ లేకపోవడం వల్ల సినిమా ఇప్పుడు చాలా బాగా కుదిరిందని దర్శక నిర్మాతలు భావించారు.

    అయినప్పటికి చిరంజీవి చెప్పిన సలహాలు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలవలేకపోయిందనేది మాత్రం చాలా వాస్తవమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాను చూడడానికి థియేటర్లో ప్రేక్షకులేవ్వరు లేకపోవడం విశేషం.

    ఇక బుక్ మై షో లో కూడా ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ పెద్దగా బుక్ అవడం లేదు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేంజర్ సినిమాకి భారీగా లాస్ రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అక్కడక్కడ కొన్ని కలెక్షన్స్ ను బాగా వసూలు చేస్తుందనే వార్తలు వస్తున్నప్పటికి ఇది కొన్ని ఏరియాల వరకే ఈ సినిమా కలెక్షన్స్ అనేవి స్టిక్ అయినట్టుగా తెలుస్తోంది.

    మరికొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాని ఆదరించేవారు లేరు అంటూ చాలామంది సినీ ప్రముఖులు సైతం విమర్శలు చేస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రామ్ చరణ్ కి ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమా రావడం అనేది నిజంగా అతని బ్యాడ్ లక్ అనే చెప్పాలి…