Chiranjeevi – Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు. దాదాపు 40 సంవత్సరాల పాటు ఈయన మెగాస్టార్ గా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికి కూడా తను వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సైతం పోటీని ఇస్తూ వస్తున్నాడు.
ఇలాంటి క్రమం లోనే ఈయన చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బి గోపాల్ చిరంజీవితో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయనకి రౌడీ ఇన్స్పెక్టర్ కథ చెప్పాడు. అయితే చిరంజీవి అప్పుడు కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని చేయలేక పోయాడు. దాంతో ఈ స్టోరీని బాలయ్య బాబుకి చెప్పి అతనితో చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక దాంతో చిరంజీవి ఖాతాలోకి రావాల్సిన ఒక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలోకి వెళ్లిపోయింది.
అయితే ఈ సినిమా చూసిన చాలామంది రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాకి బాలయ్య బాబు సరిగ్గా సరిపోయాడు. ఆ పాత్రలో ఆయన నటించిన తీరు గాని, ఆయన కనబరిచిన వైవిధ్యం కానీ ప్రేక్షకులను కట్టిపడేశాయి అంటూ అప్పట్లో చాలా కథనాలు వెలువడుతున్నాయి.ఇక చిరంజీవి బి గోపాల్ కాంబో లో ఈ సినిమా మిస్ అయిన కూడా ఆ తర్వాత ఇంద్ర లాంటి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తీసి చిరంజీవికి కూడా అదిరిపోయే ఇండస్ట్రీ హిట్ అయితే అందించాడు…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వం భర అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్య బాబు కూడా బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. చిరంజీవి చేయాల్సిన సినిమాతో బాలయ్య బాబు ఒక అదిరిపోయే హిట్ కొట్టి మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.