Rajamouli and Mahesh Babu : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికి రాజమౌళిని టచ్ చేసే దర్శకుడు మాత్రం లేరనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు విజువల్ వండర్ గా తెరకెక్కడమే కాకుండా భారీ ఎమోషన్స్ తో కూడుకొని ఉంటాయి. తద్వారా ఆయన సినిమాలని సగటు ప్రేక్షకులందరూ ఒకటికి రెండుసార్లు చూడడానికి ఇష్టపడుతుంటారు. అందువల్లే ఆయనకు భారీ కలెక్షన్స్ రావడమే కాకుండా స్టార్ డైరెక్టర్ గా కూడా ఆయన ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసి పెట్టాయి. తను చేసిన ప్రతి సినిమా ఇప్పటివరకు సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఉండడం విశేషం… ఇక ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సక్సెస్ ని అందిస్తానని మహేష్ బాబుకి మాటిచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేయాలని రాజమౌళి విపరీతమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి దాన్ని అనుకున్నట్టుగానే హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేంత దమ్ము ఈ సినిమాలో ఉందా? అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తలుచుకుంటే మిగతా దర్శకులందర్ని పక్కన పెట్టేయగలడు…
అయినప్పటికి ఆయన మహేష్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న సినిమా 1200 కోట్లు ఖర్చు చేసి మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి హాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడట. రాజమౌళికి మహేష్ బాబుకి సెట్ అవ్వదు అంటూ చాలా రోజుల నుంచి కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నప్పటికి రాజమౌళి మాత్రం మహేష్ బాబు తో చాలా సింపుల్ గా సినిమాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి.
రీసెంట్ గా ఒక భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరో నెల రోజుల తర్వాత రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి అందులో ఫైట్ సీక్వెన్స్ ని కూడా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ చేస్తున్న ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలని తద్వారా తెలుగు సినిమా స్థాయి కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ప్రతి ఒక్క తెలుగు వాడు సైతం కోరుకుంటున్నాడు…