Chiranjeevi- Tamannaah: చిరంజీవి హీరోయిన్ తమన్నా కలిసి ఇదివరకే సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు బోళాశంకర్ సినిమా కోసం జతకట్టారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ లో యక్టివ్ గా పాల్గొంటున్నారు మెగాస్టార్.
ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు, మీడియా సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, చిరంజీవి హీరోయిన్ తమన్నా భాటియాపై ప్రశంసల వర్షం కురిపించారు. తమన్నా ఆధునిక నటీమణులకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. చిరంజీవి సినిమాల పట్ల తమన్నాకి ఉండే ప్రేమ, నిబద్ధత, సమయపాలనను మెచ్చుకున్నారు. ప్రస్తుత తరం హీరోయిన్స్ కి తమన్నా స్ఫూర్తి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిరంజీవి.
అసలు విషయానికి వస్తే “భోలా శంకర్” చిత్రంలో “మిల్కీ బ్యూటీ” అనే పాట ఉంది. దానిని స్విట్జర్లాండ్‌లో రెండు వారాల పాటు చిత్రీకరించారు. పాట చిత్రీకరణ సమయంలో తమన్నా తండ్రికి అనారోగ్యం వల్ల శస్త్రచికిత్స జరిగింది. కానీ తమన్నా పాట చిత్రీకరణ వల్ల, కుటుంబంతో ఉండలేకపోయింది.ఇంతటి సవాల్ వచ్చినా కానీ తమన్నా పట్టు వదలని సంకల్పంతో పాటను పూర్తి చేసింది. ఇదే సమయంలో తన కుటుంబంతో కూడా టచ్‌లో ఉంటూ తన గొప్పతనాన్ని చాటింది ఈ హీరోయిన్. ఇక ఇదే విషయాం గురించి చిరంజీవి ప్రస్తావిస్తూ, సమస్యలు వచ్చినా కూడా తమన్నాకు సినిమా పైన ఉన్న ప్రేమ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
ఓ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘భోళా శంకర్’లో ‘మిల్కీ బ్యూటీ’ అనే పాటను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించాము. దాదాపు రెండు వారాల పాటు ఈ పాట చిత్రీకరణ సాగింది. అయితే అదే సమయంలో తమన్నా తండ్రి అనారోగ్యం వల్ల సర్జరీ చేయించుకున్నారు. ఆ వార్త విన్నప్పటికీ, తమన్నా షూట్‌ను విడిచిపెట్టలేదు, ఆమె కెమెరా ముందు డ్యాన్స్ చేసేసి, ఆపై కెమెరా వెనక్కి వెళ్లి ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందిస్తూ ఉండేది. ఇదే విషయాన్ని నేను గమనించాను. తాను తన ఫ్యామిలీ సమస్యలు ఎదుర్కొంటూన సమయంలో కూడా, సినిమా పట్ల తనకున్న గాఢమైన ప్రేమను చూపించడం నాకు ఆశ్చర్యం వేసింది.” అంటూ చెప్పుకొచ్చారు.
చిరంజీవి తమన్నాని ప్రశంసించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరియు దీని గురించి విన్న తర్వాత ఆన్‌లైన్‌లో సినీ అభిమానులు సైతం తమన్నాను ప్రశంసిస్తున్నారు.
ఇక “భోళా శంకర్” సినిమా విషయానికి వస్తే మెహర్ రమేషా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.