Chiranjeevi Daughter Sreeja: శ్రీజ, కళ్యాణ్ దేవ్ కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు విడాకులు అయ్యాయనే వార్త చాలా కాలంగా వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్స్, చర్యల ద్వారా జనాలు ఈ నిర్ణయానికి వచ్చారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. చిరంజీవి అల్లుడయ్యాక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మొదటి చిత్రం విజేత ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. చిరంజీవి ఈ చిత్రానికి ప్రచారం కల్పించారు. విజేత చిత్రం ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి ఇది ఒక రీజన్.
విజేత విడుదల అనంతరం రెండో చిత్రంగా సూపర్ మచ్చి కళ్యాణ్ దేవ్ విడుదల చేశారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలైంది. సూపర్ మచ్చి చిత్రాన్ని మెగా హీరోలు పట్టించుకోలేదు. దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయలేదు. సూపర్ మచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. మరో వైపు శ్రీజ సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు మార్చుకుంది. తన పేరు చివరన ఉండాల్సిన కళ్యాణ్ దేవ్ ని తొలగించారు. చిరంజీవి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఆయన కనిపించడం లేదు.
శ్రీజ పెద్ద కూతురు బర్త్ డే వేడుకలకు కళ్యాణ్ దేవ్ హాజరుకాలేదు. గత ఏడాది మాత్రం శ్రీజ, కళ్యా దేవ్ దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ సమీకరించి శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయిన మాట వాస్తవమే అంటున్నారు. ఓ వాదన ప్రకారం శ్రీజ, కళ్యాణ్ దేవ్ కి అధికారికంగా విడాకులు కూడా అయ్యాయి, ప్రకటన మాత్రం చేయలేదు అంటున్నారు. ఆ మధ్య శ్రీజ మూడో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. కుటుంబ సభ్యుల అనుమతితో శ్రీజ స్నేహితుడిని వివాహం చేసుకోబుతున్నారని కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. శ్రీజ కంటే ముందే కళ్యాణ్ దేవ్ వివాహం చేసుకోనున్నారట. ఆయన తన మరదలితో వివాహానికి సిద్ధమయ్యారట. శ్రీజపై కోపంగా ఉన్న కళ్యాణ్ దేవ్ ఆమె కంటే ముందు పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. కళ్యాణ్ దేవ్ వివాహం ఖాయమే అన్న న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక కళ్యాణ్ దేవ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన చివరి చిత్రం కిన్నెరసాని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల కూతురు ఇద్దరి దగ్గరా కనిపించడం కొసమెరుపు.